PM Modi US Trip: పగతో రగులుతోన్న PAK,జీహద్ కోసం కాశ్మీరుకు వెళ్లొద్దంటున్న ఇమ్రాన్ ఖాన్, నరేంద్ర మోడీకి పాక్ గగనతలంపై నో ఎంట్రీ, మోడీ ట్రంప్ భేటీ తర్వాత ఏం జరగబోతోంది ? సమగ్ర విశ్లేషణాత్మక కథనం
జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత ప్రధాని మోడీ ఇచ్చిన షాక్ నుంచి పాకిస్తాన్ ఇంకా తేరుకోలేకపోతోంది.ఇండియా ( India )ను దెబ్బ కొట్టడం సామాన్య విషయం కాదని కొత్త మార్గాలను అన్వేషిస్తోంది.
News Delhi, September 19: జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత ప్రధాని మోడీ ఇచ్చిన షాక్ నుంచి పాకిస్తాన్ ఇంకా తేరుకోలేకపోతోంది. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆర్టికల్ 370 రద్దు ( Article 370)పై ప్రపంచ దేశాలను సాయం కోరుతున్నారు. అయితే ఉగ్రవాద దేశం( Terrorist Country)గా ముద్రపడ్డ పాకిస్తాన్ కు సాయం చేయడానికి ఏ దేశం ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ( Pakistan) ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇండియా ( India )ను దెబ్బ కొట్టడం సామాన్య విషయం కాదని కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ ( Pm Modi) యుఎస్ టూరును అడ్డుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే పాకిస్తాన్ గగనతలం మీదుగా ప్రధాని నరేంద్రమోదీ విమానం వెళ్లడానికి అనుమతివ్వడంటూ భారత అధికారుల చేసిన విజ్ఞప్తిని పాక్ నిరాకరించింది. ఈ విషయాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ స్వయంగా తెలిపినట్లు పాక్ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు, అక్కడ భారత్ సాగిస్తున్న అరాచకాల నేపథ్యంలో అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు.
వచ్చేవారం మోడీ అమెరికా ( Amercia)పర్యటనకు వెళ్లనున్నారు.ఈ పర్యటనలో భాగంగా మోడీ ప్రయాణించే ప్రత్యేక విమానం పాక్ గగనతలం మీదుగా వెళ్లాల్సి ఉంది. దీని కోరకు ముందుస్తుగా భారత అధికారులు పాక్ అనుమతి కోరారు. ఎయిర్ ఇండియా వన్ విమానం కమర్షియల్ విమానం కాకపోయినప్పటికీ వీఐపీ విమానం కాబట్టి అనుమతించాలని భారత్ కోరింది. దీనిపై స్పందించిన పాక్ మోడీ విమానానికి అనుమతి ఇవ్వమని స్పష్టం చేసింది. జర్మనీ మీదుగా అమెరికా పర్యటనకు వెళ్లేందుకు తమ గగనతలాన్ని వినియోగించుకునేందుకు అనుమతిచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.ఈ మేరకు ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషనర్‌కు తమ నిర్ణయాన్ని వెల్లడించినట్లు పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషి తెలిపారు. ఈ అనుమతి నిరాకరణతో అంతర్జాతీయ పౌరవిమానయాన సంస్థ నిబంధనలకు కట్టుబడి ఉంటానని ఒప్పందం చేసుకున్న పాక్.. ప్రధాని విమానానికి అనుమతి నిరాకరణతో నిబంధనలు ఉల్లగించినట్లే అవుతుంది.
అనుమతిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన పాక్
పాకిస్తాన్‌కు ఇది కొత్తేమి కాదు
అంతకుముందు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ( Ram Nath Kovind)మూడు దేశాల పర్యటన సందర్భంలో కూడా పాక్ అనుమతి ఇవ్వలేదు. అంతకుముందు బాలాకోట్ దాడుల నేపథ్యంలో కొన్నాళ్ల పాటు పాక్ గగనతలాన్ని మూసివేసినప్పటికీ మళ్లీ పునరుద్ధరించింది.ఇప్పటికే సంఝౌతా, థార్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దుచేసిన పాక్.. లాహోర్-ఢిల్లీ బస్సు సర్వీసులను కూడా నిలిపివేసింది.కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితుల అనంతరం పాక్-భారత్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షిణించిన నేపథ్యంలో గగనతల మార్గాల నుంచి భారత్ సర్వీసులను పాక్ నిషేధించింది.
అరబ్ దేశాల మీదుగా మోడీ ప్రయాణం..
సాధారణంగా భారత్ నుంచి యూరప్, అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లే విమానాలు పాక్ గగన తలం మీదుగానే రాకపోకలు సాగిస్తుంటాయి. రోజూ 50 ఎయిర్ ఇండియా విమానాలు పాక్ గగనతలం మీదుగా ప్రయాణిస్తుంటాయి. తమ గగనతలం మీదుగా భారత విమానాలను పాకిస్తాన్ నిషేధం విధిస్తే..ఆ విమానాలన్నీ అరబ్ దేశాల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అమెరికా, యూరప్ దేశాలకు వెళ్లే విమానాలకు దూరం పెరగడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతుంది. చుట్టూ తిరిగి ప్రయాణించడం వల్ల ఫ్రాంక్‌ఫర్ట్‌కు ప్రయాణ సమయం 45 నిమిషాలు అదనంగా అయ్యే అవకాశం ఉంటుంది. హూస్టన్ ప్రయాణానికి ఫ్రాంక్‌ఫర్ట్‌లో విమానం ఇంధనం నింపుకోవాల్సి ఉంటుంది. పాకిస్తాన్ అనుమతించని పక్షంలో ప్రధాని విమానం ముంబై, అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించి మస్కట్ నుంచి యూరప్ వెళ్లాల్సి ఉంటుంది.
21 నుంచి 27 వరకు మోడీ అమెరికా పర్యటన
పీఎం నరేంద్ర మోడీ సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు మోడీ అమెరికా ( America) పర్యటనకు వెళ్తున్నారు.యూఎస్ టూర్‌లో ఆయన ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు. ఈ నెల 22న హ్యూస్టన్ నగరంలో ఎన్‌ఆర్‌ఐలతో భేటీ కానున్నారు. టెక్సాస్ ఇండియా ఫోరం హౌడీ మోడీ (Texas India Forum Howdy Modi)పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ప్రోగ్రామ్ కోసం NRIలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. NRG స్టేడియంలో జరిగే ప్రోగ్రామ్‌లో పాల్గొనడానికి ఇప్పటికే 50 వేల మందికి పైగా పేర్లు నమోదు చేసుకున్నారు. అలాగే ఈ నెల 27న ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశానికి పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ కూడా హజరుకానున్నారు.
ఎన్‌ఆర్‌ఐలతో భేటీ కానున్న మోడీ
విశిష్ట అతిథిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..
మోడీ-హౌడీ ( Howdy Mody) కార్యక్రమానికి విశిష్ట అతిథిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయనతో పాటు 60 మంది అమెరికా చట్టసభ సభ్యులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. మోడీ-ట్రంప్ ( Modi-Trump ) ఒకే వేదిక నుంచి ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతారని సమాచారం. మోడీతో వేదిక పంచుకోవడం, భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం లాంటి చర్యలు 2020లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు అనుకూలించే అంశాలుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటుగా ఈ సమావేశం ( Howdy Modi Event)వల్ల జమ్మూ కశ్మీర్ విషయంలో ప్రపంచ దేశాలకు భారత్‌పై సానుకూల సంకేతాలు వెళ్లే అవకాశం కూడా ఉంటుందని భావిస్తున్నారు. అయితే ట్రంప్, మోదీ భేటికి సంబంధించి వైట్‌హౌజ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక, మోదీ-హౌడీ కార్యక్రమం విజయవంతం కావడానికి ఇండో-అమెరికన్ ముస్లింలు కూడా కృషి చేస్తున్నారు.
అనుమతి నిరాకరణతో దాయాది దేశంపై మండిపడిన భారత్
ప్రధాని మోడీ విమానానికి పాక్ అనుమతి నిరాకరించడంపై భారత్ తీవ్రస్థాయిలో మండిపడింది. దీనిపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ మాట్లాడుతూ.. పాక్ నిర్ణయం అంత సబబుగా లేదని, వీవీఐపీ విమానాలను పాక్ ఇలా అడ్డుకోవడం రెండు వారాల్లో ఇది రెండోసారని, సాధారణంగా ఏ దేశమైనా అనుమతి మంజూరు చేస్తుందన్నారు. పొరుగు దేశాల ప్రముఖల విమానాలకు అనుమతివ్వకపోవడం అంతర్జాతీయ పౌరవిమానయాన సంస్థ (ఐసీఏఓ) నిబంధనలను ఉల్లంఘించడమేనని అన్నారు.
అనుమతి నిరాకరణతో దాయాది దేశంపై మండిపడిన భారత్
జీహాద్ కోసం కాశ్మీర్ వెళ్లకండి : పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
ఇదిలా ఉంటే జిహాద్ పోరాటం కోసం పాకిస్థానీలు కశ్మీర్‌కు వెళ్లొద్దని, ఇది కశ్మీరీల ప్రయోజనాలకు హాని కలిగిస్తుందని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ (Pakistan Prime Minister Imran Khan) హెచ్చరించారు. పాక్-అఫ్ఘనిస్థాన్ సరిహద్దులో టోర్ఖమ్ టెర్మినల్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే వారం జరిగే ఐరాస సర్వసభ్య సమావేశంలో ఇంతకుముందెన్నడూ లేని రీతిలో కశ్మీర్ అంశాన్ని బలంగా ప్రస్తావిస్తానని ఈ సంధర్భంగా ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. ఆర్టికల్ 370 రద్దును వెనక్కితీసుకోవడంతోపాటు కశ్మీర్‌లో ఆంక్షలు ఎత్తివేసేంతవరకు భారత్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదన్నారు. కాగా, పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) భారత్‌లో అంతర్భాగమని, ఏదో ఒక రోజు దానిపై భారత్‌కు అధికారం లభిస్తుందని విదేశాంగ మంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యలపై కూడా పాకిస్థాన్ స్పందించింది. భారత్ దుందుడుకు చర్యలను అంతర్జాతీయ సమాజం పరిగణనలోకి తీసుకోవాలని, ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని, ఈ ప్రాంతంలో శాంతికి విఘాతం కలిగిస్తుందని పేర్కొంది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)