Modi Ka Parivar Campaign: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మోదీ కా పరివార్, లాలూ ప్రసాద్ వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన బీజేపీ అగ్రనేతలు, విషయం ఏంటంటే..
ప్రధానిపై RJD అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ "పరివార్వాద్" వ్యాఖ్యలకు కౌంటర్ గా అమిత్ షా, JP నడ్డాతో సహా అనేక మంది అగ్రనేతలు ఈ క్యాంపెయిన్ ప్రారంభించారు.
భారతీయ జనతా పార్టీ సోమవారం ‘మోదీ కా పరివార్’తో ప్రధాన ఆన్‌లైన్ ప్రచారాన్ని ప్రారంభించింది . ప్రధానిపై RJD అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ "పరివార్వాద్" వ్యాఖ్యలకు కౌంటర్ గా అమిత్ షా, JP నడ్డాతో సహా అనేక మంది అగ్రనేతలు ఈ క్యాంపెయిన్ ప్రారంభించారు. వారి సోషల్ మీడియాలో నరేంద్ర మోదీకి సంఘీభావంగా Modi Ka Parivar Campaign చేపట్టారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ వంటి అగ్రనేతలతో సహా పలువురు తమ ఖాతాల్లో ‘‘మోదీ కా పరివార్’’ అనే పదాన్ని జోడించారు. తామంతా మోదీ కుటుంబమే అంటూ ఆయనకు అండగా నిలిచారు. దేశంలో 140 కోట్ల మంది ప్రజలు నా కుటుంబమే, ప్రతిపక్షాల వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన ప్రధాని మోదీ, నా జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని వెల్లడి
వంశపారంపర్య రాజకీయాలపై మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఆర్జేడీ అధినేత (Lalu Prasad Yadav's swipe) ఆదివారం జన్ విశ్వాస్ మహా ర్యాలీలో మహాకూటమి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, “నరేంద్ర మోదీకి సొంత కుటుంబం లేకుంటే మనం ఏం చేస్తాం. ? రామ మందిరం గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు . అతను నిజమైన హిందువు కూడా కాదు. హిందూ సంప్రదాయంలో, ఒక కొడుకు తన తల్లిదండ్రుల మరణం తర్వాత తన తల మరియు గడ్డం తీయాలి. తన తల్లి చనిపోయినప్పుడు మోదీ అలా చేయలేదని మండిపడ్డారు.
Here's News
లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యలపై సోమవారం తెలంగాణలోని ఆదిలాబాద్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ స్పందిస్తూ , “నేను వారి వంశపారంపర్య రాజకీయాలను ప్రశ్నిస్తున్నాను, అందుకే వారు మోదీకి కుటుంబం లేదని అంటున్నారు. నా జీవితం తెరిచిన పుస్తకం. నా దేశం కోసం జీవిస్తాను. 140 కోట్ల మంది భారతీయులు నా కుటుంబమేనని అన్నారు. కోట్లాది మంది తల్లులు, కుమార్తెలు, సోదరీమణులు.. వీరంతా నా కుటుంబసభ్యులే. దేశంలోని ప్రతీ పేద వ్యక్తీ నా కుటుంబమే. ఎవరూ లేనివారికి మోదీ ఉన్నారు. మోదీకి వారంతా ఉన్నారు. ‘మేరా భారత్ - మేరా పరివార్’ అనే భావనతోనే నేను జీవిస్తున్నా’’ అంటూ దీటుగా బదులిచ్చారు.
2019 ఎన్నికల ముందు కూడా ఈతరహాలో బీజేపీ నేతలు స్పందించారు. అప్పట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ..‘కాపలాదారు ఓ దొంగ’ అంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దానికి కౌంటర్‌గా కాషాయం పార్టీ నేతలంతా ‘మై భీ చౌకీదార్’(మేం కూడా కాపలాదారులం) అంటూ తమ సోషల్ మీడియా బయోల్లో మార్పులు చేశారు.