Rajasthan Minister Bhanwarlal Meghwal: టీవీలు, ఫోన్‌ల వల్లే రేప్‌లు జరుగుతున్నాయి, అవి రాకముందు ఇవేమి జరగలేదు, రేప్ కేసుల్లో మూడు నెలల్లోనే కోర్టులు తీర్పు ప్రకటించాలి, రాజస్థాన్ మంత్రి భన్వర్ లాల్ మేఘవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

టీవీలు,మొబైల్స్ phones-and-tv)రాకముందు రేప్‌లు లేవని మంత్రి తెలిపారు.

rajasthan-minister-bhanwarlal-meghwal-blames-mobile-phones-and-tv-for-rising-rape-cases (Photo-Twitter)

Jaipur, December 6: దేశంలో మహిళలపై అత్యాచారాలకు కారణం టీవీలు,మొబైల్ ఫోన్స్ మాత్రమేనని రాజస్థాన్ సాంఘీక సంక్షేమశాఖ మంత్రి భన్వర్ లాల్ మేఘవాల్ (Bhanwarlal Meghwal) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీవీలు,మొబైల్స్ phones-and-tv)రాకముందు రేప్‌లు లేవని మంత్రి తెలిపారు.ప్రస్తుతం యువతరం మొబైల్,టీవీ చూస్తూ తప్పుడు మార్గాలవైపు పయనిస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి భన్వర్ లాల్ మేఘవాల్ (Rajasthan Minister Bhanwarlal Meghwal).. హైదరాబాద్ లో జరిగిన వెటర్నరీ డాక్టర్ రేప్ ఘటనపై జైపూర్‌లో మీడియాతో మాట్లాడారు.

అసలు సమస్య అంతే టీవీలు, మొబైల్ ఫోన్ల వల్లేనని, ఈ తరం యువత వాటిని ఎక్కువ చూడటం మూలంగా అకృత్యాలు పెరిగిపోతున్నాయని అన్నారు. టీవీలు లేకుండా ఉండి ఉంటే అత్యాచారాలు జరిగేవి కావని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేప్ కేసుల్లో మూడు నెలల్లోనే కోర్టులు తీర్పు ప్రకటించాలని,దోషులను బహిరంగంగా ఉరితీయాలన్నారు.

2015లో అప్పటి బీహార్ మంత్రి బినయ్ బిహార్ కూడా రేప్ లు జరగడానికి నాన్ వెజ్ ఫుడ్,మొబైల్ ఫోన్స్ కారణమని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. గతంలో పలు రాష్ట్రాల మంత్రులు కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు. బాలీవుడ్ సినిమాలు కారణంగానే దేశంలో నేరాలు పెరిగిపోతున్నాయని కామెంట్స్ చేశారు.

కాగా దిషా ఘటనపై దేశ ప్రజలంతా నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతుంటే.. కొందరు ప్రముఖులు మాత్రం అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం డేనియల్‌ శ్రావణ్‌ అనే బాలీవుడ్‌ నిర్మాత రేప్ చేయబోతున్న వ్యక్తికి కండోమ్ ఇచ్చి మహిళలు తమ ప్రాణాలు రక్షించుకోవాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.