Rajinikanth: నా ముందు మీ ఆటలు సాగవు, బీజేపీకి దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చిన రజినీకాంత్, నాకు బీజేపీకి సంబంధం లేదన్న తలైవా, అయోధ్య తీర్పు నేపథ్యంలో కోర్టు తీర్పును గౌరవించాలని విజ్ఞప్తి
బీజేపీ తనకు కాషాయ రంగు పులమాలని చూస్తోందని ఆయన అన్నారు. తనకు, తమిళ కవి తిరువళ్లువార్(Thiruvalluvar)ను బిజెపిలోకి లాక్కోవాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.
Chennai, November 8: ప్రముఖ చలనచిత్ర నటుడు, సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) బీజేపీ(BJP)పై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ తనకు కాషాయ రంగు పులమాలని చూస్తోందని ఆయన అన్నారు. తనకు, తమిళ కవి తిరువళ్లువార్(Thiruvalluvar)ను బిజెపిలోకి లాక్కోవాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. ఇది జరిగే పని కాదని ఆయన చెప్పారు. తాను కాని, తిరువళ్లువార్ కాని బిజెపి ట్రాప్‌లో పడబోమని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే బీజేపీతో రజినీకాంత్ (Superstar Rajinikanth) సత్సంబంధాలు కొనసాగిస్తున్నాడనే ఊహాగానాలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో రజినీకాంత్ వీటన్నింటికీ ఒక్క సమావేశంతో పుల్ స్టాప్ పెట్టేశారు.
మీడియాతో రజినీకాంత్
దేశంలోనే కాదు జపాన్, చైనా, మలేషియా, సింగపూర్ లాంటి విదేశాలలో కూడా రజనీకాంత్‌కు ఎంతో క్రేజ్ ఉంది. తమిళులకు రజనీకాంత్ ఆరాధ్య దైవంతో సమానం. అందుకే ఆయన్ను ‘తలైవా’ అని ముద్దుగా పిలుచుకుంటారు. కాగా రజనీకాంత్ పుట్టుకరీత్యా మహారాష్ట్రీయన్ అయినా ఆ వాదన తమిళుల్లో ఆయనకున్న క్రేజీని ఏ మాత్రం తగ్గించలేకపోయాయి.
బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు
శివాజీరావ్ గైక్వాడ్ అన్న సొంత పేరు కంటే దర్శక దిగ్గజం కె.బాలచందర్ పట్టిన రజనీకాంత్ అనే పేరుతోనే ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమయ్యారు. అలాంటి వ్యక్తిని బీజేపీలోకి లాక్కుంటే తమిళనాడు(Tamil Nadu)లో పాగా వేయవచ్చని బీజేపీ వ్యూహ రచన చేసింది. పలు సందర్భాలలో ఆయన్ను బిజెపిలోకి లాగేందుకు ప్రయత్నించింది. ఈనేపథ్యంలో రజనీకాంత్ బిజెపిపై ఘాటైన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంమైంది.
సహజంగా సుతిమెత్తగా మాట్లాడే రజనీకాంత్ ఈ సారి బిజెపిపై కాస్త ఘాటుగానే మాట్లాడారు. తమిళనాట సుప్రసిద్ద కవి, రచయిత అయిన తిరువల్లూరుకు కాషాయ రంగు పూసినట్లుగానే తనకు కాషాయరంగు పూస్తామనుకుంటున్న బిజెపి నేతల ఆటలు సాగవంటూ రజనీకాంత్ రెచ్చిపోయారు.
అయోధ్య తీర్పుపై కోర్టు నిర్ణయాన్ని గౌరవించాలని విజ్ఞప్తి
ఈ మధ్య వేయి తిరుకురల్ రాసి, తెలుగు నాట యోగి వేమన లాగే పేరుగాంచిన తిరువల్లూరు విగ్రహానికి బీజేపీ నేతలు కాషాయ రంగు వేశారు. అదే మాదిరిగా తనకు బిజెపి కాషాయ రంగు పూయాలనుకుంటోందని, కానీ బీజేపీ నేతల ఆటలు తన ముందు సాగవని రజనీకాంత్ శుక్రవారం కామెంట్ చేశారు.
రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నూతన కార్యాలయ ప్రాంగణంలో ప్రముఖ దర్శకుడు కే.బాలచందర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో రజినీ పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరై తిరుగు ప్రయాణం అయిన రజినీకాంత్‌ను తిరువళ్లవర్ విగ్రహ వివాదంపై స్పందించాలని మీడియా కోరింది.
మీడియా ప్రశ్నలకు జవాబు
‘నాకు కాషాయ రంగును పూయాలని బీజేపీ చూస్తోంది. ఈ విధంగానే తిరువళ్లువర్‌కు కూడా కాషాయరంగు వేయాలని చూస్తున్నారు. నేను బీజేపీ వ్యక్తిని కాదు. నాకు కాషాయ రంగు పులమకండి. తిరువళ్లువర్ లాంటి గొప్ప రచయిత చుట్టూ రాజకీయం చేయకండి. అనవసర వివాదానికి తెరలేపకండి’ అని వ్యాఖ్యానించారు.
కమల్ హాసన్ గురించి రజినీకాంత్ వ్యాఖ్యలు
కాగా అయోధ్య కేసు తుది అంకానికి వస్తున్న నేపథ్యంలో అందరూ కోర్టు తీర్పును గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. శాంతి యుతంగా ఉండాలని సూచించారు. దీంతో పాటు కమల్ హాసన్ విషయంలో కూడా తలైవా స్పందించారు. కమల్ రాజకీయాల్లోకి వచ్చినా సినిమాను వీడరని తెలిపారు. కమల్ కు నటనంటే ప్రాణమని తర్వాతే ఏదైనా అని తెలిపారు.