Rajya Sabha Elections 2024: రెండో సారి రాజ్యసభకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్, బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల ఫస్ట్, సెకండ్ లిస్టు ఇదిగో..
రెండో లిస్టులో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఒడిషా నుంచి రాజ్యసభకు రీనామినేట్ అయ్యారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు కేంద్ర సమాచార & ప్రసార శాఖ మంత్రి(సహాయ) డాక్టర్ ఎల్. మురుగన్ తో పాటు మరో ముగ్గురు ఉమేష్ నాథ్, మాయ నరోలియా, బన్సీలాల్ గుర్జర్ పేర్లను బీజేపీ నామినేట్ చేసింది.
New Delhi, Feb 14: త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ తన రెండో లిస్టును ప్రకటించింది. రెండో లిస్టులో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఒడిషా నుంచి రాజ్యసభకు రీనామినేట్ అయ్యారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు కేంద్ర సమాచార & ప్రసార శాఖ మంత్రి(సహాయ) డాక్టర్ ఎల్. మురుగన్ తో పాటు మరో ముగ్గురు ఉమేష్ నాథ్, మాయ నరోలియా, బన్సీలాల్ గుర్జర్ పేర్లను బీజేపీ నామినేట్ చేసింది.
మాజీ ఐఏఎస్ అధికారి అయిన అశ్వినీ వైష్ణవ్.. 2019లో తొలిసారి ఒడిషా అధికార పార్టీ బీజూ జనతా దళ్(BJD) మద్దతుతో నెగ్గారు. రెండోసారి కూడా ఆయన గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మధ్యప్రదేశ్‌లోనూ మురుగన్ గెలుపు దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. రాజ్యసభ సీట్లలో సంఖ్యా బలం ఆధారంగా చూసుకుంటే.. బీజేపీ నాలుగు, కాంగ్రెస్ ఒక్క సీటు గెల్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తొలి లిస్టులో బీహార్ నుంచి ధర్మశీల గుప్తా, భీమ్‌సింగ్, ఛత్తీస్‌గఢ్ నుంచి రాజా దేవేంద్ర ప్రతాప్ సింగ్‌లను బీజేపీ బరిలోకి దింపింది. హర్యానా నుంచి సుభాష్ బరాలా, కర్ణాటక నుంచి నారాయణ కృష్ణస భాండాగే, ఉత్తరాఖండ్ నుంచి మహేంద్ర భట్, పశ్చిమ బెంగాల్ నుంచి సమిక్ భట్టాచార్య పోటీ చేయనున్నారు. ఆర్పీఎన్ సింగ్, సుధాన్షు త్రివేది, చౌదరి తేజ్వీర్ సింగ్, సాధన సింగ్, అమర్‌పాల్ మౌర్య, సంగీతా బల్వంత్, నవీన్ జైన్ ఉత్తరప్రదేశ్ నుంచి పోటీలో ఉన్నారు.
Here's First and Second List
ఎనిమిది మంది కేంద్ర మంత్రులు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో సహా మొత్తం 58 మంది రాజ్యసభ సభ్యులు ఈ ఏడాది మే మొదటి వారంలో పదవీ విరమణ చేయనున్నారు. మన్‌సుఖ్ మాండవ్య, భూపేందర్ యాదవ్, పర్షోత్తమ్ రూపాలా, ధర్మేంద్ర ప్రధాన్, వి మురళీధరన్, నారాయణ్ రాణే, రాజీవ్ చంద్రశేఖర్, అశ్విని వైష్ణవ్ ఎనిమిది మంది మంత్రులు ఏప్రిల్ 2-3 నాటికి పదవీ విరమణ చేయనున్నారు, వీరితో పాటు మన్మోహన్ సింగ్, నడ్డాతో సహా 47 మంది ఇతర ఎంపీలు ఉన్నారు.