Asaduddin Owaisi: మోదీతో పాటు నేను కూడా భావోద్వేగానికి గురయ్యా, అక్కడ మసీదు మసీదుగా మిగిలిపోతుంది, ప్రజాస్వామ్యం,లౌకికవాదం ఓడిపోయి హిందుత్వం గెలిచిందన్న అసదుద్దీన్ ఒవైసీ
ప్రజాస్వామ్య, లౌకిక విలువలకు కట్టుబడి ఉంటానని పదవీ స్వీకారంలో చేసిన ప్రమాణాన్ని మోదీ ధిక్కరించారని మండిపడ్డారు. కాగా, పునాది రాయి వేసిన అనంతరం తన ప్రసంగంలో భావోద్వేగానికి లోనయ్వానన్న ప్రధాని వ్యాఖ్యలను ఓవైసీ ప్రస్తావిస్తూ.. ఈ దేశ పౌరుడిగా తాను కూడా అంతే తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యానని చెప్పుకొచ్చారు.
New Delhi, August 5: రామ మందిర నిర్మాణ శంకుస్థాపను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకావడాన్ని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ( Asaduddin Owaisi) తప్పు పట్టారు. ప్రజాస్వామ్య, లౌకిక విలువలకు కట్టుబడి ఉంటానని పదవీ స్వీకారంలో చేసిన ప్రమాణాన్ని మోదీ ధిక్కరించారని మండిపడ్డారు. కాగా, పునాది రాయి వేసిన అనంతరం తన ప్రసంగంలో భావోద్వేగానికి లోనయ్వానన్న ప్రధాని వ్యాఖ్యలను ఓవైసీ ప్రస్తావిస్తూ.. ఈ దేశ పౌరుడిగా తాను కూడా అంతే తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యానని చెప్పుకొచ్చారు. మోదీ కొత్త నినాదం జై సియా రామ్, రాముని నినాదాలతో మార్మోగిన అయోధ్య, వందల ఏళ్ల తర్వాత నిరీక్షణ ఫలించిందని తెలిపిన ప్రధాని మోదీ
ఈరోజు ప్రజాస్వామ్యం, లౌకికవాదం ఓడిపోయి హిందుత్వం గెలిచింది. ప్రధానమంత్రి తన ప్రమాణ స్వీకారాన్ని ధిక్కరించి (PM Modi Violated Oath) రామ మందిరానికి పునాది రాయి వేశారు. లౌకిక దేశమైన ఇండియాలో ఇలాంటివి జరగడమేంటి? పునాది రాయి వేసిన అనంతరం భావోధ్వేగానికి లోనయ్యానని తన ప్రసంగంలో ప్రధాని చెప్పుకొచ్చారు. ఈ దేశ పౌరుడిగా, వారితో పాటే జీవిస్తున్న వాడిగా నేనూ తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాను. ఎందుకంటే 450 ఏళ్ల నుంచి ఆ ప్రాంతంలో మసీదు (Babri Masjid) ఉంది’’ అని ఓవైసీ అన్నారు.
Here's Asaduddin Owaisi Tweet
అక్కడ బాబ్రీ మసీదు (Babri Masjid) ఉండేది, ఎల్లప్పుడు ఉంటుంది కూడా అని ఆల్ ఇండియా మజ్లిస్-ఈ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బుధవారం ఉదయం ట్వీట్ చేశారు. దీనికి బాబ్రీ మసీద్‌కు చెందిన రెండు పురాతన చిత్రాలను ఆయన షేర్ చేశారు. బాబ్రీ మసీదు మసీదుగా మిగిలిపోతుందని, ఎందుకంటే ఒక ప్రదేశంలో ఒక మసీదు స్థాపించబడితే, అది శాశ్వతత్వంలో ఒకటిగా మిగులుతుందని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డ్ కూడా పేర్కొంది. అయోధ్యలో రామ్ మందిరాన్ని నిర్మించటానికి సుప్రీంకోర్టు నవంబర్ 2019లో ఇచ్చిన తీర్పు అన్యాయమని ముస్లిం పర్సనల్ లాబోర్డు తెలిపింది.
కాగా అయోధ్య రామమందిర నిర్మాణానికి భూమిపూజను నిర్వహించిన అనంతరం... అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై నుంచి మాట్లాడుతూ ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు. ఇదొక చారిత్రాత్మక దినమని చెప్పారు. వందల ఏళ్ల నిరీక్షణ ఈరోజు ముగిసిందని చెప్పారు. దేశ ప్రజలందరి ఆకాంక్షలతో రామ మందిరం నిర్మాణం జరుపుకుంటోందని తెలిపారు.దశాబ్దాల పాటు రామ్ లల్లా ఆలయం టెంట్ లోనే కొనసాగిందని ఆవేదన వ్యక్తం చేశారు.