Sanjay Raut Criticizes Ajit Pawar: అజిత్ పవార్‌ది వెన్నుపోటు, మా కళ్లలోకి కళ్లు పెట్టి చూడటానికి భయపడ్డాడు, తప్పు చేసిన వాడిలా తల దించుకున్నాడు, మహా ట్విస్టుపై స్పందించిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్

రాత్రికి రాత్రే దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం (Devendra Fadnavis was sworn in as Maharashtra chief minister )చేశారు. దీంతో శివసేన ఒక్కసారిగా షాక్ కు గురయింది. మహారాష్ట్ర సీఎం అంశం మీద ఆది నుంచి మీడియాకు ఎప్పటికప్పుడు ట్విస్టులు ఇస్తూ వచ్చిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Shiv Sena MP Sanjay raut)ఈ విషయం మీద స్పందించారు.

shivsena-mp-sanjay-raut-criticizes-ajit-pawar (Photo-Facebook

Mumbai, November 23: గత కొంతకాలంలో దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మహా సీఎం రాజకీయాలు ట్విస్టుల మీద ట్విస్టులతో ముగిసాయి. రాత్రికి రాత్రే దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం (Devendra Fadnavis was sworn in as Maharashtra chief minister )చేశారు. దీంతో శివసేన ఒక్కసారిగా షాక్ కు గురయింది. మహారాష్ట్ర సీఎం అంశం మీద ఆది నుంచి మీడియాకు ఎప్పటికప్పుడు ట్విస్టులు ఇస్తూ వచ్చిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Shiv Sena MP Sanjay raut)ఈ విషయం మీద స్పందించారు.

ఎన్సీపీ నేత అజిత్ పవార్ (Ajit Pawar) వెన్నుపోటు రాజకీయాలకు తెరలేపారని మండిపడ్డారు. ప్రభుత్వ ఏర్పాటుతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు.

నిన్న రాత్రి 9 గంటల వరకు మాతోనే ఉన్న అజిత్ పవార్ ఆ తర్వాత నుంచి అనుకోకుండా మాయమైపోయారు. మాతో ఉన్న సమయంలో మా కళ్లలో కళ్లు పెట్టి చూడటానికి భయపడ్డారు. అసలు చూడటానికే ఇష్టపడలేదు. తప్పు చేసిన వాడిలా తల దించుకుని ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడారు.

అప్పుడే మాకు ఏదో జరగబోతుందని అనుమానం వచ్చిందని అన్నారు. అజిత్ పవార్ ఆయనకు మద్దతు ఇస్తున్న ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఛత్రపతి శివాజీ సిద్దాంతాలను అవమానించారని తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ సంజయ్ రౌత్ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.

శరద్ పవార్, శివసేన అధినేత ఉధ్దవ్ ఠాక్రే మాతో టచ్ లో ఉన్నారు. ఈ రోజు కూడా వారు భేటీ అవుతారు. ఇద్దరూ కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిపారు.