Punjab Congress: సీఎం అభ్యర్ధిత్వంపై కార్యకర్తలదే తుది నిర్ణయం, మా మధ్య విభేధాలు లేవంటూ చన్నీ, సిద్ధూ ప్రకటన, పంజాబ్ లో రాహుల్ టూర్ లో పలు ఆసక్తికర సంఘటనలు
పంజాబ్(Punjab) లో విజయం కోసం కాంగ్రెస్(Congress) పార్టీ చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ప్రచారాన్ని ముమ్మరం చేశారు నేతలు. ఇక పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలపై దృష్టిసారించింది అధిష్టానం. సీఎం చన్నీ(CM Channi), పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ(PCC Chief Siddu) మధ్య సఖ్యత కోసం ప్రయత్నిస్తున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)
Chandigarh, January 27: పంజాబ్(Punjab) లో విజయం కోసం కాంగ్రెస్(Congress) పార్టీ చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ప్రచారాన్ని ముమ్మరం చేశారు నేతలు. ఇక పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలపై దృష్టిసారించింది అధిష్టానం. సీఎం చన్నీ(CM Channi), పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ(PCC Chief Siddu) మధ్య సఖ్యత కోసం ప్రయత్నిస్తున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi). సీఎం అభ్యర్ధి ఎవరన్నదానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. పంజాబ్‌లోని జలంధర్ లో రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ సభలో.. పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్చన్నీ(Charanjit Singh Channi), పీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Sidhu) పాల్గొన్నారు. అయితే తాము సీఎం పదవి కోసం ఆశపడబోమని ఆ సభలో బహిరంగంగా హమీ ఇచ్చారు. కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు.
అదే విధంగా ఒకరు నాయకత్వం వహిస్తే మరొకరు వారికి సహకారం అందిస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పలు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ లేదా పంజాబ్ కోరుకుంటే త్వరలోనే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుందని అన్నారు’. ఈ ప్రకటనతో చన్నీ వర్సెస్ సిద్ధూల మధ్య పోటీకి తెరపడినట్లు తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులు నాయకత్వం వహించలేరు.. ఒకరు మాత్రమే సరైన నాయకుడిగా ఉండగలరని ఆయన అన్నారు.
సీఎం అభ్యర్థిని ఎవరు ఉండాలనే దాన్ని కాంగ్రెస్ కార్యకర్తలనే అడుగుతామన్నారు. అయితే, చన్నీ, నవజ్యోత్ సింగ్ ఇద్దరు నాయకులు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తారని తెలుస్తుందన్నారు. ఈ సందర్భంగా సిద్ధూ మాట్లాడుతూ.. క్రమశిక్షణ కల్గిన కాంగ్రెస్ సైనికుడిలా పనిచేస్తానని అన్నారు. తనను ‘షోపీస్’లా ట్రీట్ చేయోద్దని అన్నారు. ‘ మనమంతా పంజాబ్‌లో కాంగ్రెస్‌ను అధికారంలో తేవడానికి ఐక్యంగా పోరాడదామన్నారు.
ఇదే వేదికపై ఉన్న చన్నీ కూడా.. సిద్ధూ దగ్గరకు వెళ్లి తమ ఐక్యతను చూపే ప్రయత్నం చేశారు. ఈ సభలో సీఎం చన్నీకూడా మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి పదవికి ఎవరి పేరును ప్రతిపాదించిన అభ్యంతరంలేదన్నారు.’ ఎవరి పేరు ప్రతిపాదించిన ప్రచారం కోసం పనిచేసే మొదటి వ్యక్తి తానేనని చన్నీ స్పష్టం చేశారు. ఆ తర్వాత చన్నీ.. అరవింద్ కేజ్రీవాల్‌పై ఫైర్ అయ్యారు. అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత పోరు ఉందని వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని చురకలంటించారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)