West Bengal Assembly Elections 2021 Phase 7: ఓ వైపు కరోనా కల్లోలం..మరోవైపు బెంగాల్‌లో మొదలైన ఏడో దశ ఎన్నికల పోలింగ్, మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్‌, మే 2న ఎన్నికల ఫలితాలు

ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు. మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో (34 Vidhan Sabha Seats) ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. ఏడో దశ ఎన్నికల పోటీలో 268 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

Voting | Represtional Image | (Photo Credits: PTI)

Kolkata, April 26: పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ఏడో దశ పోలింగ్ (West Bengal Assembly Elections 2021 Phase 7) సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు. మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో (34 Vidhan Sabha Seats) ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. ఏడో దశ ఎన్నికల పోటీలో 268 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

భోవానిపూర్ నియోజకవర్గ టీఎంసీ అభ్యర్థి శోభండేబ్ చటోపాధ్యాయ్‌ మన్మతానాథ్ నందన్ పాఠశాలలోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత ఎన్నికల్లో ప్రస్తుత సీఎం మమతా బెనర్జీ ఈ నియోజకవర్గంలో గెలుపొందిన విషయం తెలిసిందే.

ఈ దశలో పోలింగ్‌లో 86 లక్షలమంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 12,068 పోలింగ్ బూత్‌ల ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో హింసాత్మక సంఘటనల దృష్ట్యా.. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా చివరి దశ పోలింగ్ ఏఫ్రిల్ 29న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్నాయి.

చిన్నపిల్లల్ని టార్గెట్ చేసిన కరోనా సెకండ్ వేవ్, దేశంలో రికార్డు స్థాయిలో 24 గంటల్లో 3,52,991 కరోనా కేసులు నమోదు, 2,812 మరణాలు, రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌ వల్ల ప్రమాదముందని తెలిపిన ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా

ప‌శ్చిమ‌బెంగాల్ ప్ర‌జ‌లు ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జి వెంటే ఉన్నార‌ని తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్ర‌త్ జ‌హాన్ చెప్పారు. ఏడో విడుత అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ సంద‌ర్భంగా నుస్ర‌త్ జ‌హాన్ త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి కోల్‌క‌తాలోని ఓ పోలింగ్ బూత్‌లో ఆమె ఓటు వేశారు.

అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ మోదీ ప్ర‌భుత్వంపైన‌, ఎన్నిక‌ల సంఘంపైన విమ‌ర్శ‌లు చేశారు. ఎన్నిక‌ల సంఘం కేంద్ర ప్ర‌భుత్వం చెప్పిన‌ట్ట‌ల్లా తోకాడిస్తున్న‌ద‌ని నుస్ర‌త్ ఆరోపించారు. క‌రోనా నేప‌థ్యంలో ఎన్నిక‌ల బ‌హిరంగస‌భ‌ల్లో పాల్గొన‌కూడ‌ద‌ని ప్ర‌ధాని నిర్ణ‌యించుకున్న త‌ర్వాత ఎన్నిక‌ల సంఘం బ‌హిరంగ‌స‌భ‌లపై నిషేధం విధించింద‌ని.. ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోంమంత్రి చెప్పిన‌ట్లే ఈసీ న‌డుచుకుంటున్న‌ద‌ని విమ‌ర్శించారు.

రాష్ట్రంలో ఓ వైపు కరోనా కల్లోలం రేపుతుండగా..మరోవైపు పోలింగ్ కొనసాగుతోంది. బెంగాల్లో ఒక్కరోజే ఆదివారం ఒక్కరోజే 15 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. 57 మంది కరోనాతో మరణించారు.