Jharkhand Shocker: లక్ష రూపాయల లోన్ కట్టలేదని గర్బిణిని ట్రాక్టర్‌తో తొక్కించి చంపాడు, జార్ఖండ్‌లో రికవరీ ఏజెంట్ అరాచకం, ట్రాక్టర్ తీసుకువెళ్లకుండా అడ్డుకున్నందుకు దారుణం
కానీ, ఆ రికవరీ ఏజెంట్ ఆ ట్రాక్టర్‌తో ఆమెను తొక్కించి వెళ్లాడు. ట్రాక్టర్ మీద నుంచి వెళ్లడంతో ఆ గర్భిణి అక్కడే మరణించింది
Ranchi, SEP 17: జార్ఖండ్‌లో దారుణం జరిగింది. లోన్ కట్టలేదని ట్రాక్టర్ రికవరీ (recovery) చేసేందుకు వచ్చిన ఏజెంట్, అదే ట్రాక్టర్‌తో గర్భిణి అయిన యజామాని కూతురును తొక్కి చంపాడు. ఈ ఘటన జార్ఖండ్, హజారిబాగ్ (Hazaribag) జిల్లా, ఇచాక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బరియానాథ్ అనే గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన మిథిలేష్ మెహతా (Mithilesh Mehta) అనే రైతు ఒక ఫైనాన్స్ కంపెనీ నుంచి లోన్ తీసుకున్నాడు. దానికి సంబంధించి రూ.1.3 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఈ విషయంలో అతడికి ఒక మెసేజ్ వచ్చింది. లోన్ చెల్లించకపోతే ట్రాక్టర్ (tractor) తీసుకెళ్తామని అందులో ఉంది. ఈ క్రమంలో గత గురువారం గ్రామానికి చేరుకున్న రికవరీ ఏజెంట్ (recovery agent), అక్కడి పెట్రోల్ బంకు దగ్గర పార్కు చేసి ఉన్న ట్రాక్టర్‌ను డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. వెంటనే మిథిలేష్ ట్రాక్టర్ వెంట పరుగెత్తుకుంటూ వెళ్లాడు. ట్రాక్టర్‌కు అడ్డుపడ్డాడు. తాను వెంటనే రూ.1.2 లక్షలు చెల్లిస్తానని, ట్రాక్టర్ వదిలేయమని బతిమాలాడు.
కానీ, పూర్తి డబ్బు చెల్లిస్తేనే ట్రాక్టర్ వదిలిపెడతానని చెప్పి, ట్రాక్టర్ తోలుకుంటూ వెళ్లాడు రికవరీ ఏజెంట్. అప్పుడు గర్భిణి (Pregnant) అయిన మిథిలేష్ కూతురు పరుగెత్తుకుంటూ వచ్చి, ట్రాక్టర్ అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ, ఆ రికవరీ ఏజెంట్ ఆ ట్రాక్టర్‌తో ఆమెను తొక్కించి వెళ్లాడు. ట్రాక్టర్ మీద నుంచి వెళ్లడంతో ఆ గర్భిణి అక్కడే మరణించింది.
ఈ ఘటనపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రికవరీ ఏజెంట్‌తోపాటు, ఫైనాన్స్ సంస్థ మేనేజర్‌ను, ఇతర బాధ్యులను త్వరగా అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. కేసు తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.