Indian Spider Man: కిక్కిరిసి ఉన్న రైలులో పైన రాడ్లు పట్టుకుని వేలాడుతూ ముందుకెళ్లిన యువకుడు.. ఇండియన్ స్పైడర్ మ్యాన్ అంటూ సరదా కామెంట్లు.. వీడియో మీరూ చూసేయండి..

ట్విట్టర్ ఖాతాలో వీడియో పోస్ట్.. క్షణాల్లో వైరల్

Indian Spider Man (Credits: Twitter)

NewDelhi, October 18: రైలు (Train) కదులుతూ వెళ్తోంది. బోగీలో సీట్లు లేని ఖాళీ ప్రదేశంలో, సీట్ల మధ్యన జనం కింద కూర్చుని ఉన్నారు. ఇంతలో ఓ యువకుడు అక్కడికి వచ్చాడు. వారిని దాటి సీట్ల వద్దకు వెళ్లాలి. తన సీటులో కూర్చోవాలి. కానీ వెళ్లడానికి ఖాళీ లేదు. దీనితో బోగీలో పైన ఉన్న రాడ్లు (Rods) పట్టుకుని వేలాడుతూ.. అలాగే ముందుకు కదులుతూ.. కింద కూర్చున్నవారిని దాటేశాడు. మొత్తానికి అవతలివైపు వెళ్లి కూర్చున్నాడు. రైలులో ఉన్నవారు ఈ వీడియో (Video) తీశారు. ప్రొఫెసర్ ఎన్ జీఎల్ రాజాబాబు పేరిట ఉన్న ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేయగా వైరల్ గా మారింది.

మహా మంత్రికి మహా షాక్.. మంత్రికి ఆపరేషన్ చేస్తుండగా పోయిన కరెంట్.. సెల్‌ఫోన్ టార్చ్ లైట్ లో ఆపరేషన్ పూర్తి చేసిన వైద్యులు.. అనంతరం జనరేటర్ కోసం నిధులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి

‘భారత్ లో స్పైడర్ మ్యాన్ (స్పైడర్ మ్యాన్ భారత్ మే)’ అని దీనికి క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోకు 45 వేలకుపైగా వ్యూస్, రెండున్నర వేలకుపైగా లైకులు వచ్చాయి.