Bizarre Hug: సంతోషంతో హగ్ ఇచ్చింది.. ఛాన్స్ అనుకున్నాడు అతడు.. గట్టిగా బిగి కౌగిట్లో బంధించాడు.. రిజల్ట్.. ఆమె బాడీలో మూడు పక్కటెముకలు బ్రేక్
రిజల్ట్.. ఆమె బాడీలో మూడు పక్కటెముకలు బ్రేక్
Beijing: August 17: కొన్ని వార్తలు చదవగానే నవ్వు తెప్పించడంతో పాటు.. హవ్వా! ఇదేంటి అనిపిస్తాయి. అలాంటి ఘటనే తాజాగా చైనాలో జరిగింది. ప్రాజెక్ట్ వర్క్ సక్సెస్ కావడంతో ఓ మహిళ సంతోషంతో తన సహోద్యోగికి హగ్ ఇచ్చింది. అయితే, ఇదే చాన్స్ అనుకున్న అతగాడు.. ఆమెను బిగి కౌగిలిలో బంధించాడు. ఎంతలా అంటే ఆమెకు ఊపిరి ఆడనంతగా. దీంతో అసౌకర్యానికి గురైన ఆమె.. హాస్పిటల్ లో చెక్ చేయించుకున్నది. ఎక్స్ రే తీయగా మూడు పక్కటెముకలు విరిగినట్టు తేలింది. దీంతో ఆమె అతనిపై కోర్టులో దావా వేసింది. విచారించిన కోర్టు.. బాధితురాలికి రూ. 1.16 లక్షలు పరిహారాన్ని ఇప్పించింది.