Kochi, NOV 10: క్రికెట్‌లో వికెట్ కీపర్‌ల విన్యాసాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. నిన్నటి తరం ఆడమ్ గిల్‌క్రిస్ట్ (Adam Gilcrest) మొదలుకుని ఇప్పటికీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో (IPL) తనదైన విన్యాసాలతో అలరిస్తున్న జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీలు (Dhoni) తమవైన స్కిల్స్‌తో క్రీజులో ఉన్న బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించగల సమర్థులు. తమకు ఆమడ దూరంలో బంతి వెళ్తున్నా ముందుకు డైవ్ చేస్తూ క్యాచ్ పట్టడంలో ఒక్కో వికెట్ కీపర్‌ది ఒక్కో శైలి. కానీ ఇంతవరకూ బహుశా ప్రపంచ క్రికెట్‌లో ఏ వికెట్ కీపర్ కూడా పట్టని రీతిలో నడుము ద్వారా క్యాచ్ అందుకున్నాడు.
We have a winner.
This is the greatest wicket-keeper catch of all-time! 😂
[h/t @kreedajagat] pic.twitter.com/b9EIKH34JV
— That’s So Village (@ThatsSoVillage) November 9, 2023
వివరాల్లోకెళ్తే.. కేరళ ప్రీమియర్ లీగ్‌లో (Kerala Premier League) భాగంగా కేపీఏ 123 వర్సెస్ కేసీఎస్‌ఎ కాలికట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పటికే రెండు ఓవర్లలోనే పది పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. ఫిరాజ్ (Firoz) అనే బౌలర్ మూడో ఓవర్ వేయగా.. బంతి కాస్తా బ్యాటర్ ఎడ్జ్‌కు తాకి వికెట్ కీపర్ పక్కదిశగా వెళ్లింది. అదే సమయంలో కీపర్ పక్కకు డైవ్ చేస్తూ క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు.