IPL Auction 2025 Live

Beer Can Help You Combat Obesity: బీరు తాగితే బొజ్జలు కరిగిపోతాయి, పొట్ట తగ్గిపోతుంది, సుఖవంతమైన నిద్ర పడుతుంది,దీనికి కారణం అందులో ఈస్ట్ మిశ్రమం ఉండటమేనట, ఆమ్‌స్టర్‌డామ్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ పరిశోధనలో వెల్లడి

మీకు రాత్రి పూట నిద్ర రావడం లేదా.. సుఖవంతమైన నిద్ర కోసం ముఖం వాచిపోయి ఉన్నారా..అయితే రోజుకో బీరు తాగండి.. మీరు రోజూ ఓ బీరు తాగడం వల్ల పొట్ట కరిగిపోవడమే( Beer can help you combat obesity) కాకుండా సుఖవంతమైన నిద్ర(getting a better night's sleep)పడుతుందట.

Beer can help you combat obesity and get a good night's sleep (Photo-GETTY)

Mumbai,December 1: మీకు పొట్ట ఎక్కువగా ఉందా, బొజ్జతో బయట తిరగలేకున్నారా..అయితే ఇకపై మీరు రోజుకొక బీర్ తాగండి. మీకు రాత్రి పూట నిద్ర రావడం లేదా.. సుఖవంతమైన నిద్ర కోసం ముఖం వాచిపోయి ఉన్నారా..అయితే రోజుకో బీరు తాగండి.. మీరు రోజూ ఓ బీరు తాగడం వల్ల పొట్ట కరిగిపోవడమే( Beer can help you combat obesity) కాకుండా సుఖవంతమైన నిద్ర(getting a better night's sleep)పడుతుందట. ఈ విషయాన్ని ఆమ్‌స్టర్‌డామ్‌ యూనివర్శిటీ(Amsterdam University)లో బ్యాక్టీరియా నిపుణుడిగా పనిచేస్తున్న ప్రొఫెసర్‌ ఎరిక్‌ క్లాసెన్‌ (Professor Eric Claassen) చెబుతున్నారు. మరి దీనికి కారణం కూడా ఆయనే చెబుతున్నారు.

బీరులో ఉన్న మంచి గుణాలున్నాయట. వీటిలో ఒకరకమైన బ్యాక్టీరియా(probiotic microbes – bacteria), ఈస్ట్‌ మిశ్రమం (probiotic yeast) ఉండడమే అందుకు కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే అన్ని బీర్లలో ఈ గుణం ఉందో, లేదో తెలియదుగానీ బెల్జియంకు చెందిన హోగార్డెన్, వెస్ట్‌మల్లే ట్రిపల్, ఎట్‌ క్రైకెన్‌బియర్‌ బ్రాండ్‌ల బీర్లలో ఈ మంచి గుణాలు ఉన్నాయట. ఆ బీర్లు రెండుసార్లు, భూగర్భంలో ఉండగా ఒకసారి, సీసాలో మరోసారి బీరు పులియడం వల్ల వాటికి ఆ మంచి గుణాలు వస్తాయట.

భూగర్భంలో పులియడానికి ఒకరకమైన ఈస్ట్, సీసాలో పులియడానికి మరో రకమైన ఈస్ట్‌ను ఉత్పత్తిదారులు ఉపయోగిస్తున్నారని, ఈ రెండోసారి పులియడంతోనే బీరులో ఎక్కువగా ఆరోగ్య లక్షణాలు చేరుతున్నాయని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. వాటిలో కూడా లైట్‌ బీరుకన్నా స్ట్రాంగ్‌ బీరే మంచిదని, అలా అని ఎక్కువగా బీర్లు తాగమని వారు సిఫార్సు చేస్తున్నారు. ‘ఎక్కువ ఆల్కహాల్‌ ఆరోగ్యానికి మంచిది కాదు, ఈ రకమైన బ్రాండ్లలో రోజొకటి తాగినా ఆరోగ్యానికి మంచిదే. ఈ రకాల బీరు బాటిళ్లలో 50 శాతానికిపైగా మంచి బ్యాక్టీరియా ఉంది’ ఆయన చెబుతున్నారు. సో అదన్న మాట విషయం