Processed Food: కమ్మగా ఉన్నాయని చిప్స్‌, స్నాక్స్‌, మ్యాగీ వంటి పదార్థాలు తింటున్నారా? రుచిగా, చల్లగా ఉన్నాయని ఫిజీ డ్రింక్స్‌, కూల్‌ డ్రింక్స్‌ ఎగబడి తాగుతున్నారా? అయితే జాగ్రత్త.. ప్రాసెస్డ్‌ ఫుడ్‌ తో మీకు ఆయుక్షీణమే.. అకాల మరణం పొంచిఉన్నట్టే.. 30 ఏండ్లపాటు సాగిన అధ్యయన నివేదిక తేల్చిచెప్పిన విషయమిది

కమ్మటి ఆ రుచిని ఎప్పుడు ఆస్వాదిద్దామా అనుకుంటాం.

Processed Food (Credits: X)

Newdelhi, May 10: షాప్ లో చిప్స్‌ (Chips), స్నాక్స్‌ (Snacks), మ్యాగీ చూడగానే నోట్లో నీళ్లు ఊరుతాయి. కమ్మటి ఆ రుచిని ఎప్పుడు ఆస్వాదిద్దామా అనుకుంటాం. ఇక చల్లగా ఉండే ఫిజీ డ్రింక్స్‌, కూల్‌ డ్రింక్స్‌ (Cool Drinks) ను ఎప్పుడెప్పుడు తాగుదామా అనుకోని వారు ఉండరు. అయితే మీకు అలర్ట్. ఇలాంటి ప్రాసెస్డ్‌ ఫుడ్‌ తింటే మీ జీవితకాలాన్ని కోల్పోతున్నట్టే. ఆయుక్షీణం కొని తెచ్చుకున్నట్టే. అకాల మరణ ప్రమాదాన్ని ఆహ్వానించినట్టే. 30 ఏండ్లపాటు సాగిన ఓ అధ్యయన నివేదిక ఈ మేరకు వెల్లడించింది. ఈ వివరాలు బీఎంజే జర్నల్‌ ప్రచురించింది.

Andhra Pradesh Elections 2024: ఆరు నూరైనా నూరు ఆరైన నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే, కర్నూలు సభలో స్పష్టం చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి

అలా ఆరోగ్యం దెబ్బతింటుంది

అధ్యయనం ప్రకారం.. ఉప్పు, కొవ్వు, చక్కెర అధికంగా ఉండే అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్‌ తరచూ తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్లు, మినరల్స్‌ సరైనపాళ్లలో అందకపోవడం వల్ల మనిషి ఆరోగ్యం దెబ్బతింటుంది. అది ఊబకాయం, షుగర్, రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్‌ వంటి ప్రమాదాలను పెంచుతుంది. ఇది అకాల మరణానికి దారితీయొచ్చు.

ముస్లింలకు రిజర్వేషన్లు తొలగించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తాం, భువనగిరి సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ