Telangana Elections 2024: ముస్లింలకు రిజర్వేషన్లు తొలగించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తాం, భువనగిరి సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ
Amit Shah vs Rahul Gandhi (photo-ANI)

Hyd, May 9: తెలంగాణలోని యాదాద్రి భువనగిరిలోని బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ..‘రాహుల్‌ పిల్ల చేష్టల గ్యారంటీలు.. మోదీ గ్యారంటీల మధ్య జరుగుతున్న ఎన్నికలివి’ అని అన్నారు. కాంగ్రెస్‌ పరిస్థితి దయనీయంగా తయారైందని, ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకట్లేదని ఎద్దేవా చేశారు.

మోదీ ఏం చెబుతారో దానిని తప్పకుండా చేస్తారని, రాహుల్‌ ఇచ్చిన గ్యారంటీలు అమలయ్యే పరిస్థితి లేదని అన్నారు. రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ అమలు కాలేదు. వారికి ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం ఇవ్వలేదు. వరి, గోధుమలకు రూ.500 బోనస్‌ అందించలేదు. కాంగ్రెస్‌ చేసిన వాగ్దానాలను ఎన్నటికీ నెరవేర్చదు. ఆ పార్టీ 70 ఏళ్లుగా అయోధ్య విషయాన్ని పక్కన పెట్టిందని మండిపడ్డారు.

ఇవి కుటుంబ అభివృద్ధి, దేశ అభివృద్ధికి మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. తెలంగాణ(telangana)లో బీజేపీ 2019 ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచింది. కానీ ఈసారి 10 సీట్లు గెలవబోతున్నామని తెలిపారు. మూడు విడతల్లో ఇప్పటికే 200 సీట్లు గెలిచామని, మిగిలిన దశల్లో మొత్తం 400 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.  భారత్‌లో ముస్లిం జనాభా పెరగడానికి కాంగ్రెస్సే కారణం, మండిపడిన బీజేపీ, ఇలా అయితే హిందువులకు దేశం ఉండదంటూ ఫైర్

కాంగ్రెస్ ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇవ్వడంతో షెడ్యూల్ కులాలు, తెగల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అమిత్ షా చెప్పారు. ఈ నేపథ్యంలో బీజేపీకి రాష్ట్రంలో పది సీట్లు ఇస్తే ముస్లింల రిజర్వేషన్ తొలగించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తామని అన్నారు. కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే. అంతేకాదు ఇప్పటికే వాగ్దానం చేసినట్లుగానే ప్రధాని మోదీ(pm modi) రామ మందిర నిర్మాణం చేయించి చూపించారని అమిత్ షా గుర్తు చేశారు.

Here's Meeting Live Video

ఖర్గే చెప్పినట్టుగా రాజస్థాన్, తెలంగాణ ప్రజలకు కశ్మీర్‌కు ఏమి సంబంధమని ఎద్దేవా చేశారు. ఆర్టికల్ 370ని తొలగించి కశ్మీర్‌లో త్రివర్ణ పతాకం ఎగరేలా చేశామని షా అన్నారు. మోదీ ఉగ్రవాదం, తీవ్రవాదం వంటి వాటిని రూపుమాపి మావోయిస్టు సిద్ధాంతాలు లేకుండా చేస్తున్నారని హోమంత్రి పేర్కొన్నారు.  దేశంలో తగ్గిపోతున్న హిందూ జనాబా, పెరుగుతున్న ముస్లిం జనాభా, సంచలన నివేదికను బయటపెట్టిన పీఎం ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్

ఆర్టికల్‌ 370 రద్దుతో కశ్మీర్‌లో త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా చేశాం. ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని మోదీ పరిసమాప్తం చేశారు. దేశాన్ని సురక్షితంగా ఉంచారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్, మజ్లిస్‌ మధ్య త్రికోణ బంధం ఉంది. మూడు పార్టీలు హైదరాబాద్‌ విమోచన దినోత్సవం నిర్వహించవు. రద్దు చేసిన ట్రిపుల్‌ తలాక్‌ను పునరుద్ధరించేందుకు యత్నిస్తున్నారు.

అసలు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓవైసీని నిలువరించగలవా అని షా ప్రశ్నించారు. ఈ క్రమంలో ఏబీసీ అనే పదాలకు కొత్త అర్థాలు చెప్పారు. ఏ అంటే అసదుద్దీన్, బీ అంటే బీఆర్ఎస్, సీ అంటే కాంగ్రెస్ అని అమిత్ షా వెల్లడించారు. ఈ పార్టీలు గతంలో హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని కూడా నిర్వహించలేదని హోం మంత్రి ప్రస్తావించారు. ఇలాంటి పార్టీలను ప్రజలు నమ్మోద్దని ప్రజలకు సూచించారు.

భువనగిరి టెక్స్‌టైల్‌ పరిశ్రమల కోసం మోదీ కృషి చేశారు. రూ.1500 కోట్లతో జాతీయ టెక్స్‌టైల్‌ విధానం అమల్లోకి తెచ్చాం. భువనగిరి నుంచి భూపాలపల్లి వరకు జాతీయ రహదారి నిర్మించాం. బీబీ నగర్‌ ఎయిమ్స్‌ నిర్మించి పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాం. జనగామ నుంచి భువనగిరి వరకు రైల్వే లైన్ల ఆధునికీకరణ చేపట్టాం. కొమురవెల్లిలో అత్యాధునిక రైల్వే స్టేషన్‌ నిర్మిస్తున్నాం. భారాస ప్రభుత్వ హయాంలో కుటుంబం మాత్రమే బాగుపడింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణను ఏటీఎంగా వాడుకుంటోంది’’ అని అమిత్‌షా విమర్శించారు.