Femina Miss India 2024: ఫెమినా మిస్ ఇండియా పోటీల‌కు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు యువతులు.. మిస్ తెలంగాణగా ప్ర‌కృతి కంభం.. మిస్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ గా భ‌వ్యారెడ్డి

మరికొద్ది రోజుల్లో జరుగనున్న ఫెమినా మిస్ ఇండియా-2024 పోటీల‌కు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్ద‌రు యువ‌తులు ఎంపిక‌య్యారు.

Prakruthi Kambam, Bhavya Reddy (Credits: Google)

Hyderabad, Aug 24: మరికొద్ది రోజుల్లో జరుగనున్న ఫెమినా మిస్ ఇండియా-2024 (Femina Miss India 2024) పోటీల‌కు తెలుగు రాష్ట్రాల (Telugu States) నుంచి ఇద్ద‌రు యువ‌తులు ఎంపిక‌య్యారు. తెలంగాణ‌కు చెందిన ప్ర‌కృతి కంభం, ఆంధ్ర‌ప్రదేశ్ కు చెందిన భ‌వ్యారెడ్డి ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. తద్వారా త్వరలో జరుగనున్న ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో వీళ్ళిద్దరూ పాల్గొని ఫెమినా మిస్ ఇండియా టైటిల్ కోసం పోటీప‌డ‌నున్నారు. ఈ నెల 13న ముంబైలో జ‌రిగిన అర్హత పోటీల్లో ఫెమినా మిస్ తెలంగాణగా ప్ర‌కృతి కంభం, మిస్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ గా భ‌వ్యారెడ్డి వారి సొంత రాష్ట్రాల త‌ర‌ఫున పోటీప‌డి గెలుపొందారు.

అందగత్తెల ప్రయాణం ఇలా..

తెలంగాణకు చెందిన ప్ర‌కృతి ప్రస్తుతం బెంగ‌ళూరులో ఉంటున్నారు. మోడ‌లింగ్‌, క్రీడా రంగాల్లో ఆమె రాణిస్తున్నారు. ఇక ఏపీకి చెందిన భ‌వ్యారెడ్డి హైద‌రాబాద్‌ లోని లోతుకుంటలో నివాసం ఉంటున్నారు. ఇంజ‌నీరింగ్ కంప్లీట్ చేసి, మోడ‌లింగ్‌ పై దృష్టిసారించారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif