Apara Ekadashi 2022: అపారమైన ధన సంపద కావాలా, అయితే మే 26న అపర ఏకాదశి రోజున ఉపవాసంతో ఈ వ్రతం చేయండి..
అపర ఏకాదశిని అచల ఏకాదశి అని కూడా అంటారు. పంచాంగం ప్రకారం, అపర ఏకాదశి జ్యేష్ఠ మాసంలోని కృష్ణ పక్షంలోని ఏకాదశి రోజున వస్తుంది. అపర ఏకాదశి విష్ణువుకు అంకితం చేయబడింది. ఈ ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువు, లక్ష్మిని పూజిస్తారు.
Apara Ekadashi 2022: 2022 సంవత్సరపు అపర ఏకాదశి మే 26, గురువారం నాడు నిర్వహిస్తారు. అపర ఏకాదశిని అచల ఏకాదశి అని కూడా అంటారు. పంచాంగం ప్రకారం, అపర ఏకాదశి జ్యేష్ఠ మాసంలోని కృష్ణ పక్షంలోని ఏకాదశి రోజున వస్తుంది. అపర ఏకాదశి విష్ణువుకు అంకితం చేయబడింది. ఈ ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువు, లక్ష్మిని పూజిస్తారు.
హిందు సంప్రదాయంలో అపర ఏకాదశికి ప్రముఖమైన స్థానముంది వైశాఖ కృష్ణపక్షం రోజు వచ్చే ఏకాదశిని అపర లేదా అజల ఏకాదశి (నీరు లేకుండా ఉపవాసం చేసే ఏకాదశి) అని అంటారు. ఈ ఏకాదశి నాడు విష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు.
అపర ఏకాదశి రోజున వామనావతరంలో ఉన్న విష్ణువును పూజిస్తారు. ఈ రోజున వామన అవతారాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వారు సర్వ పాపాల నుంచి విముక్తి పొందుతారని భక్తులు ఎంతగానో నమ్ముతారు. నదీస్నానం ఈ రోజు ఎంతో ప్రత్యేకమైంది. అపర ఏకాదశి రోజున నదీ స్నానం చేయడం వల్ల సకల పాపాలు కూడా పరిష్కరమవుతాయని అంటారు.
ఏకాదశి రోజున ఉపవాసం పాటించే వ్యక్తి తెల్లవారుజామున నిద్రలేచి తల స్నానం చేయాలి. ఉపవాసం ప్రారంభించడానికి ముందు శుభ్రమైన బట్టలు ధరించాలి. ఉపవాసం పాటించే వారు సూర్యాస్తమయం వరకూ ఆహారం తీసుకోకూడదని గమనించాలి. అలాగే అపరా ఏకాదశి సందర్భంగా సాయంత్రం పళ్లు, పాలు వంటి సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి. అంటే మాంసాహారాన్ని భుజించకూడదు. సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి.