Astrology: ఎంత సంపాదించినా డబ్బు మిగలట్లేదా..అయితే ఈ ఐదు పనులు చేయండి.

డబ్బు నిలవట్లేదా అయితే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకొని ఈ ఐదు పనులు చేస్తే మీ ఇంట్లో ఎప్పుడు కూడా సిరిసంపదలు నిలువ ఉంటాయి.

astrology

ఎంత కష్టపడి పనిచేసిన కూడా జేబులు ఖాళీగా ఉంటున్నాయా. డబ్బు నిలవట్లేదా అయితే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకొని ఈ ఐదు పనులు చేస్తే మీ ఇంట్లో ఎప్పుడు కూడా సిరిసంపదలు నిలువ ఉంటాయి.

చాలామంది లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు. దీనికి కారణం వారికి భక్తి లేకపోవడం కాదు సరైన ఆచారాలను పాటించకపోవడం. ఈరోజు ఆ ఐదు ఆచారాలు గురించి మనం తెలుసుకుందాం. దీని ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది పేదరికం పోయి ఐశ్వర్యవంతులు అవుతారు.

సాయంత్రం పూజ: వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం కంటే కూడా సాయంత్రం సమయంలో అంటే సంధ్యా సమయంలో లక్ష్మీదేవిని పూజించడం ద్వారా చాలా శుభప్రదం జరుగుతుంది. సాయంత్రం సమయంలో మీరు గనక లక్ష్మీదేవిని పూజిస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది.

దీపం వెలిగించాలి: లక్ష్మీదేవి పూజ సమయంలో ఎప్పుడు కూడా దీపం వెలిగించడం శుభప్రదం. దాని నుండి వెళితే వెలుగు మీ సంతోషాలకు ఐశ్వర్యానికి వెలుగునిస్తుంది. అంతేకాకుండా ధూపం ఇవ్వడం కూడా లక్ష్మీదేవికి సంతోషాన్ని ఇస్తుంది. ఆమె అనుగ్రహాన్ని పొందుతారు. అంతేకాకుండా లక్ష్మీదేవిని పూజించేటప్పుడు శంఖాన్ని ఊదడం కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. దీని ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

చీపురును తన్నవద్దు: వాస్తు శాస్త్రం ప్రకారం చీపురును లక్ష్మీదేవిగా పరిగణిస్తారు. దీనివల్ల చీపురును ఎప్పుడు కూడా కాలితో తన్నవద్దు. దీన్ని శుభ్రం చేసిన తర్వాత మంచి ప్రదేశంలో ఉంచండి. దీని ద్వారా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. మురికి ప్రదేశాలలో చీపురును ఉంచకూడదు.

Astrology: ఆగస్టు 22 నుండి బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం..

ఇంటిలి శుభ్రంగా ఉంచుకోవాలి: లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎల్లప్పుడూ కూడా మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. అపరి అపరిశుభ్రమైన ప్రదేశాలకు లక్ష్మీదేవి దూరంగా ఉంటుంది. అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి దరిచేరదు. కాబట్టి ఎల్లప్పుడూ ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.

కొబ్బరికాయ: కొబ్బరి ప్రతి శుభకార్యంలో ఉపయోగించే ఫలం. దీన్నే శ్రీఫలం అని కూడా అంటారు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఈ కొబ్బరి అందుకే లక్ష్మీదేవి పూజ సమయంలో తప్పనిసరిగా కొబ్బరికాయను కొట్టండి. పూజ అనంతరం ఈ కొబ్బరిని అందరికీ ప్రసాదంగా ఇస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ మీ పైన ఉంటుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.