Diwali Wishes 2024 In Telugu: దీపావళి పర్వదినం సందర్భంగా మీ బంధు మిత్రులకు ఫోటోల రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండి..
దీనితో పాటు దీపాలు కూడా వెలిగిస్తారు. లక్ష్మీదేవిని పూజించడం వల్ల సంతోషం, సౌభాగ్యం పెరుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండిలా..
సనాతన ధర్మంలో దీపావళికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ అమావాస్య నాడు జరుపుకుంటారు. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని ఈ రోజున పూజిస్తారు. సనాతన గ్రంథాలలో పురాతన కాలంలో, సముద్ర మథనం సమయంలో, ఆశ్వీయుజ అమావాస్య నాడు లక్ష్మీదేవి అవతరించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ అమావాస్య రోజున దీపావళి జరుపుకుంటారు. అదే సమయంలో, త్రేతా యుగంలో, 14 సంవత్సరాల వనవాసం తర్వాత శ్రీరాముడు తిరిగి వచ్చినందుకు అయోధ్య ప్రజలు దీపాలు వెలిగించి దీపావళిని జరుపుకున్నారు. ఈ శుభ సందర్భంలో సంపదలకు దేవత అయిన లక్ష్మీ దేవిని, గణేశుడిని పూజిస్తారు. దీనితో పాటు దీపాలు కూడా వెలిగిస్తారు. లక్ష్మీదేవిని పూజించడం వల్ల సంతోషం, సౌభాగ్యం పెరుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండిలా..
మీ అందరి జీవితాల్లో చీకట్లు తొలగిపోయి, వెలుగులు ప్రసరించాలని ,ఈ దీపావళి పండగ సందర్భంగా ప్రతి ఇంటా ఆనందపు వెలుగులు నిండాలని కోరుకుంటు మీకు మీ కుటుంబ సభ్యులు అందరికి దీపావళి శుభాకాంక్షలు.
ఒకొక్క దీపం వెలిగిస్తూ చీకట్లని పారద్రోలినట్లు, ఒకొక్క మార్పు సాధించుకుంటూ గొప్ప జీవితాన్ని నిర్మించుకుందాం! మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు..
దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహః
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే
ఆత్మీయులకు దీపావళి శుభాకాంక్షలు...
దీపావళి, వెలుగుల పండుగ.. జీవితంలో కొత్త వెలుగులు, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు..
సంతోషానికి, శుభానికి ప్రతీకగా దీపాలను వెలిగించి పండుగ చేసుకుంటున్న ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు .