Astrology: ఉప్పు ఎవరికి దానం ఇవ్వవద్దని ఎందుకు అంటారో తెలుసా... దీని ఉద్దేశం ఏంటో తెలుసుకోండి.?
అసలు ఉప్పును నేరుగా ఎందుకు ఇవ్వకూడదు ? దీని గురించి హిందూ ధర్మం ఏం చెబుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
భారతీయులకు రకరకాల నమ్మకాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా హిందువులు రకరకాల ఆచారాలను పాటిస్తుంటారు. ఒక్కొక్కరూ ఒక్కో సంప్రదాయాన్ని పాటిస్తుంటారు. హిందువులకు చాలా విశ్వాసాలుంటాయి. అలాంటి వాటిలో ఒకటి ఉప్పును పక్క వారికి చేతికి ఇవ్వకూడదు. సాధారణంగా ఉప్పు డబ్బాను ఎదుటి వ్యక్తికి ఇచ్చే సమయంలో నేరుగా చేతికి ఇవ్వకూడదని చెబుతుంటారు. అసలు ఉప్పును నేరుగా ఎందుకు ఇవ్వకూడదు ? దీని గురించి హిందూ ధర్మం ఏం చెబుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మనం దానం చేసే దశ దానాల్లో ఉప్పు ఒకటి. పితృ దానాల్లో శని దానాల్లో ఉప్పుని దానం చేస్తుంటారు. అందుకే పూజల దగ్గర ఉప్పుని దూరంగా ఉంచుతారు. ఉప్పుతో దిష్టి తీస్తే దుష్ట శక్తులు పోతాయని కూడా నమ్ముతారు. ఉప్పు అందించడం అంటే ఒకరి రహస్యాన్ని మరొకరికి చెప్పడమే అని అర్థం. అందుకే ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని ఉప్పు చేతిలోకి అందుకునే వారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుందని నమ్ముతుంటారు.
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది ...
ఇక పురాణాల ప్రకారం.. అమృతం కోసం చేసిన సాగర మధనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారు అవుతుంది. అందుకే ఉప్పుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఆర్థిక కష్టాల నుంచి గట్టు ఎక్కాలంటే ఉప్పుతో పరిహారాలు చేయాలని సూచిస్తుంటారు. ముఖ్యంగా జ్యేష్టాదేవిని వదిలించుకునేందుకు ఉప్పుతో పరిహారాలు చేస్తారు. ఉప్పును ఎవరి చేతి నుంచి అయినా అందుకుంటే వారి చెడు మీకు సంక్రమిస్తుందని విశ్వసిస్తుంటారు. అందుకే ఉప్పును చేతికి ఇవ్వవద్దని పేర్కొంటారు. ఈ చిట్కాను మీరు కూడా పాటించి హ్యాపీ గా ఉండండి.