Adhika Shravana Masam: జూలై 17 నుంచి అధిక శ్రావణ మాసం ప్రారంభం, అధిక శ్రావణ మాసం అంటే ఏంటి..ఈ మాసంలో చేయకూడని పనులు ఇవే..
జూలై 17 నుంచి ప్రారంభమయ్య శ్రావణమాసం ఈ సంవత్సరం అధికమాసం గా ప్రారంభం కాబోతోంది. ఈ అధికమాసం జూలై 17 నుంచి ఆగస్టు 17 వరకు ఉంటుంది. ఆ తరువాతే ఆగస్టు 18 నుంచి నిజ శ్రావణమాసం ప్రారంభమవుతుంది. నిజ శ్రావణమాసం ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఉంది.
ఈ సంవత్సరం శ్రావణ మాసానికి ఓ ప్రత్యేకత ఉంది. జూలై 17 నుంచి ప్రారంభమయ్య శ్రావణమాసం ఈ సంవత్సరం అధికమాసం గా ప్రారంభం కాబోతోంది. ఈ అధికమాసం జూలై 17 నుంచి ఆగస్టు 17 వరకు ఉంటుంది. ఆ తరువాతే ఆగస్టు 18 నుంచి నిజ శ్రావణమాసం ప్రారంభమవుతుంది. నిజ శ్రావణమాసం ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఉంది. ఈ నిజశ్రావణమాసంలోనే పండగలు శుభకార్యాలు జరుపుకుంటారు. అధికమాసంలో శుభకార్యాలు లేవు కావున అధికమాసంలో చేయవలసిన పనులు చేయకూడని పనులు ఏవో తెలుసుకుందాం.
అధిక శ్రావణ మాసంలో శుభకార్యాలు చేయకూడదు అని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా అధికమాసంలో పెళ్లిళ్లు చేయకూడదని పండితులు చెబుతున్నారు. అలాగే గృహప్రవేశాలు వ్యాపార ప్రారంభాలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.
అధికమాసంలో చేయకూడని పనులు ఇవే
>> వివాహాలు చేయకూడదు
>> నూతన వ్యాపారం ప్రారంభించకూడదు
>> ఆస్తి కొనుగోలు చేయకూడదు
>> కొత్త ఇంటికి శంకుస్థాపన చేయకూడదు
>> ఉపనయనం వంటి శుభకార్యాలు చేయకూడదు
> ఇతర శుభకార్యాలను కూడా తలపెట్టకూడదు
Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి,
ఈసారి ఏర్పడుతున్న శ్రావణ అధికమాసం దాదాపు 19 సంవత్సరాల తర్వాత ఏర్పడుతోంది. సాధారణంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి తెలుగు నెలల ప్రకారం ఒక నెల అధికమాసం వస్తూ ఉంటుంది. ఆ విధంగా చూస్తే ఈ సంవత్సరం తెలుగు క్యాలెండర్లో 13 నెలలు ఉన్నాయి. అందులో శ్రావణమాసం రెండుసార్లు వచ్చింది ఇందులో మొదటి భాగాన్ని అధిక శ్రావణమాసం అని రెండవ మాసాన్ని నిజస్రావణ మాసం అని పిలుస్తారు. సాధారణంగా ఆషాడం అధికమాసం వస్తూ ఉంటుంది కానీ ఈ సంవత్సరం దాదాపు 19 సంవత్సరాల తర్వాత శ్రావణమాసం అధికమాసం రూపంలో వచ్చింది. ఈ అధికమాసంలో పరమశివుడికి పూజలు చేస్తే చాలా మంచిది. . ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం కూడా నిజస్రావణ మాసంలోనే జరుపుకోవాల్సి ఉంటుంది అంటే ఆగస్టు 17 తర్వాతనే శ్రావణ శుక్రవారం ప్రారంభించాల్సి ఉంటుంది.