Ganesh Chaturthi Wishes: వినాయక చవితి సందర్భంగా మీ స్నేహితులకు, బంధువులకు ఇలా విష్ చేయండి..

వినాయకుడు సిద్ది, బుద్ది ప్రదాయకుడు అని ప్రజలు విశ్వసిస్తారు. విద్యార్థులు గణపతి పూజలో పాల్గొంటే ప్రకృతితో మమేకమైన మన సంస్కృతి పట్ల అవగాహన కలుగుతుంది.

భారతీయ సంప్రదాయంలో ప్రతిఏటా భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి రోజున వినాయక చవితి పండగను జరుపుకుంటారు. వినాయకుడు సిద్ది, బుద్ది ప్రదాయకుడు అని ప్రజలు విశ్వసిస్తారు. విద్యార్థులు గణపతి పూజలో పాల్గొంటే ప్రకృతితో మమేకమైన మన సంస్కృతి పట్ల అవగాహన కలుగుతుంది. గణేష్ చతుర్థి పండుగను సెప్టెంబర్ 7వ తేదీ శనివారం జరుపుకుంటారు. ఈ రోజున, మొదటి పూజ్యుడైన గణేశుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. గణేశుడిని పూజించడం ద్వారా, సాధకుడు జీవితంలో ఆనందం, శ్రేయస్సు, సంపదను పొందుతాడు. చతుర్థి రోజున వినాయకుడు భూమిపై నివసిస్తాడు, అందుకే ప్రజలు ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారని చెబుతారు. గణేశుడిని మీ ఇంటికి ఆహ్వానించడం చాలా సులభం, దీని కోసం మీరు మీ ఇంటి ఆలయాన్ని స్వామికి ఇష్టమైన వస్తువులతో అలంకరించవచ్చు.

ముక్కోటి దేవతల మొక్కులు అందుకునే వాడవు

విఘ్నాలను తొలగించే ఓ బొజ్జ గణపయ్యవు

అందరి ఆశయాలను నెరవేర్చే వాడవు

కోరిన కోర్కెలను తీర్చే ఓ బొజ్జ గణపయ్యవు

అందరికీ ఆ గణనాధుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ..

వినాయక చవితి శుభాకాంక్షలు.

విఘ్నేశ్వరుడు మీ విఘ్నాలను తొలగించి మీకు ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలిగించాలని కోరుకుంటూ… వినాయక చవితి శుభాకాంక్షలు.

ఆ విఘ్నాదిపతి మీకు క్షేమ, స్థైర్య ఆయురారోగ్యాలు సిద్ధించాలని, సుఖసంతోషాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు.

మీరు చేసే ప్రతీ కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం చేకూరాలని, వినాయక చవితి రోజున మీరందరూ మనసారా గడపాలని కోరుకుంటున్నాను. వినాయక చవితి శుభాకాంక్షలు

మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం కావాలని వినాయక చవితి పండుగ రోజున ప్రజలందరూ ఆనందం గా గడపాలని మనసారా కోరుకుంటూ... వినాయక చవితి శుభాకాంక్షలు