Brothers Day 2022 Wishes: బ్రదర్స్ డే నేడు, కష్టంలో, నష్టంలో తోడుగా ఉండేవాడే బ్రదర్, మరి ఈ రోజును ఎందుకు జరుపుకుంటారు, బ్రదర్ అంటే ఎలా ఉండాలో చెప్పే బ్రదర్స్ డే మెసేజెస్, వాట్సప్ స్టిక్కర్స్ మీకోసం

అసలు ఎందుకు ఈ బ్రదర్స్ డేని జరుపుకుంటారంటే అలబామాకు చెందిన ఓ సిరామిక్ కళాకారుడు, శిల్పి, రచయిత అయిన సి డేనియల్ రోడ్స్ పేరు వినిపిస్తుంది.

National Brother’s Day 2022 Quotes (File Image)

Brothers Day 2022: మదర్స్ డే, ఫాదర్స్ డే లాగే నేడు బ్రదర్స్ డే ని జాతీయ స్థాయిలో జరుపుకుంటున్నారు. అసలు ఎందుకు ఈ బ్రదర్స్ డేని జరుపుకుంటారంటే అలబామాకు చెందిన ఓ సిరామిక్ కళాకారుడు, శిల్పి, రచయిత అయిన సి డేనియల్ రోడ్స్ పేరు వినిపిస్తుంది. ఈయన మొదటగా ఈ రోజుని (Brothers Day 2022) జరుపుకున్నారు. 2005 నుంచి ప్రతి సంవత్సరం మే 24న ఈ బ్రదర్స్ డేని జరుపుకుంటారు. మొదట్లో దీనిని అమెరికాలో మాత్రమే జరుపుకునేవారు. తర్వాత ప్రపంచం మొత్తం జరుపుకోవడం ప్రారంభించింది. కొన్ని దేశాలలో అయితే ఈ రోజున (National Brothers Day) అధికారిక సెలవు కూడా ఇస్తారు.

మన ఇంట్లో కూడా మనకి చిన్న సమస్య వచ్చినా అప్పటికప్పుడు వచ్చి మన గురించి ఆలోచించి సమస్యని పరిష్కరించే వాడే బ్రదర్. అన్న అంటే ఓ బాధ్యత. నాన్న తర్వాత చాలా బాధ్యతలు చూసుకోవాల్సింది ఆయనే. అదే విధంగా తమ్ముడు అంటే కూడా బాధ్యతగానే ఉంటాడు. కానీ, ఓ చిన్న అల్లరితనం ఉంటుంది. ఇందులో అమ్మాయిలైతే తమ బ్రదర్స్ తమకి సెక్యూరిటీ అని చెప్పొచ్చు. ఇప్పటికీ చాలా ఇళ్ళల్లో 20 ఏళ్ళ అమ్మాయిని బయటికి వెళ్తే 15ఏళ్ళ తమ్ముడో లేకుంటే అన్నో తోడు వెళ్ళాల్సిందే. ఇంట్లో తనని ఏడిపించే అబ్బాయిలే బయట ఎవరైనా ఏడిపిస్తుంటే వాళ్ళని ఎదురించగలరు. బ్రదర్స్ డే సందర్భంగా ఈ మెసేజెస్ ద్వారా విషెస్ చెప్పేయండి.

Brothers Day 2022 Wishes
Brothers Day 2022 Wishes

 

Brothers Day 2022 Wishes
Brothers Day 2022 Wishes

ఆడపిల్లలు పెళ్ళై మెట్టినింటికి చేరాక కూడా అక్కడ ఏ సమస్యలు వచ్చినా, అన్నా తమ్ముళ్ళే ముందుండి సమస్యను పరిష్కరిస్తారు. ఇక మగవారైతే చెప్పాల్సిన అవసరమే లేదు చిన్నోడు పెద్దోడులా.. ఏ సమస్య వచ్చినా జీవితాంతం కలిసుండే హక్కు వీరికి ఉంటుంది