Happy Dussehra Wishes In Telugu: దసరా నవరాత్రుల సందర్భంగా మీ బంధు మిత్రులకు ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి..
ఈ రోజున, దుర్గా దేవి ఎనిమిదవ రూపమైన మాత గౌరీని పూజిస్తారు. నవరాత్రుల అష్టమిని దుర్గాష్టమి, మహా దుర్గాష్టమి అని కూడా అంటారు. మహాష్టమి పూజ శుభ సందర్భంగా, దుర్గా దేవి మొత్తం తొమ్మిది రూపాలను పూజిస్తారు. నవరాత్రులలో అష్టమి పూజ ఎప్పుడు నిర్వహిస్తారో తెలుసుకుందాం.
నవరాత్రులలో అష్టమి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున, దుర్గా దేవి ఎనిమిదవ రూపమైన మాత గౌరీని పూజిస్తారు. నవరాత్రుల అష్టమిని దుర్గాష్టమి, మహా దుర్గాష్టమి అని కూడా అంటారు. మహాష్టమి పూజ శుభ సందర్భంగా, దుర్గా దేవి మొత్తం తొమ్మిది రూపాలను పూజిస్తారు. నవరాత్రులలో అష్టమి పూజ ఎప్పుడు నిర్వహిస్తారో తెలుసుకుందాం. ఆశ్వీయుజ మాసంలోని శుక్ల పక్ష అష్టమి తిథి అక్టోబర్ 10 మధ్యాహ్నం 12:35 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి అక్టోబర్ 11 మధ్యాహ్నం 12:05 గంటలకు ముగుస్తుంది. ఈ సంవత్సరం సప్తమి వ్రతం అక్టోబర్ 10న ఆచరిస్తారు. దుర్గాష్టమి సందర్బంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయాలని ఉందా..అయితే గ్రీటింగ్స్ మీ కోసం..
జగన్మాత దుర్గా దేవి దివ్యాశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, సిరిసంపదలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ప్రజలందరికీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు..
ఐశ్వర్యం, ధీరత్వం, కీర్తి, తేజస్సు, ఆరోగ్యం, ఆకర్షణ, ఆనందం, సౌజన్యం అనే అష్టమహా ఫలితాల్ని శరన్నవరాత్రుల్లో భక్తులు దేవీ కరుణతో సాధిస్తారని దేవీ భాగవతం వివరించింది . అందుకోసం విజయద అయిన అపరాజిత అనుగ్రహాన్ని సర్వదా ఆకాంక్షించాలి.. అందరికి విజయదశమి శుభాకాంక్షలు..
దుర్గా మాత ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ..మీకు, మీ కుటుంబసభ్యులకు దేవి నవరాత్రుల శుభాకాంక్షలు
దుర్గామాత నవ రూపాలలో ఒకటైన 'శ్రీ మహాచండీ దేవి' అలంకారంలో దర్శనమిస్తున్న దర్శనమిస్తున్న ఆ తల్లి దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికి క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు కలగాలని ఆశిస్తూ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియచేస్తుంది
మనలోని దుర్గుణాలే రాక్షసులు, మన లోని దైవాంశే ఆ మహాశక్తి. ఆ శక్తిని గుర్తించి, ఆరాధించి తద్వారా మనలోని దుర్గుణాలను తొలగించమని వేడుకోవడమే దుర్గా నవరాత్రుల పూజలోని అంతరార్థం. - మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు