International Men's Day: మగజాతి ఆణిముత్యాల్లారా.. పండగ చేస్కోండి, ఈరోజు మీరోజు. నేడు ప్రపంచ పురుషుల దినోత్సవం, ఈరోజుకున్న విశిష్టత ఎంటో తెలుసుకోండి
మగాడైనా, వాడూ మనిషే, వారి పట్ల మానవతతో వ్యవహరించాలి అని చాటిచెప్పటం ....
November 19: వినాపురుష జననం నాస్తి, వినాపురుష మరణం నాస్తి వినా పురుష జీవం నాస్తి వినాపురుష ఏవం నాస్తి అన్నాడు ఓ మగజాతి ఆణిముత్యం. అంటే ఈ సృష్టిలో ఆడవారికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, మగవారికీ అంతే ఉంటుంది అనే అర్థం వస్తుంది. ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు ఈ భూమి మీద మగాడు, రేయింబవళ్లు కష్టపడి ఈ సృష్టిని ముందుకు నడపడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. మరి అలాంటి మగవారి కోసం ఒక గుర్తింపంటూ ఉండకూడదా? అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నవంబర్ 19న అంతర్జాతీయ పురుషుల దినోత్సవం (International Men's Day) గా నిర్వహిస్తున్నారు.
మగవారి ఆరోగ్యం, మగవారితో సత్సంబంధాలు మెరుగుపరచటం, మగ- ఆడ మధ్య సమానత్వాన్ని ప్రోత్సహించడం, పురుషుల పట్ల వివక్షతను ఎత్తిచూపడం, మగజాతి ఆణిముత్యాలను (role models) అందరికీ పరిచయం చేస్తూ, వారు సాధించిన విజయాలను మరియు ఘనతలను ఈ ప్రపంచానికి తెలియచెప్పటమే లక్ష్యంగా ఈ పురుషుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. Men Fashion -మగవారికి మాత్రమే ప్రత్యేకం, మగవారూ ఇక రెచ్చిపోండి
ప్రత్యేకించి ఈ సమాజంలో మగవారు నిర్వహించే కుటుంబ బాధ్యత, కుటుంబ సభ్యుల పోషణ మరియు వారి సంరక్షణ కోసం మగవారు చేసే కృషిని, త్యాగాలను గుర్తించడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మగాడైనా, వాడూ మనిషే, వారి పట్ల మానవతతో వ్యవహరించాలి అని చాటిచెప్పటం అంతిమ లక్ష్యంగా ఈరోజుకు అంతర్జాతీయంగా ప్రాముఖ్యత కల్పిస్తున్నారు.
1989లో జెరోమ్ టీలుక్సింగ్ (Jerome Teelucksingh) అనబడే ఓ మగజాతి ఆణిముత్యం, తన తండ్రి పుట్టిన రోజైన నవంబర్ 19ని పురుషుల దినోత్సవంగా ఎంపిక చేసి అందుకు విశేషమైన ప్రాచుర్యం కల్పించారు. తన తండ్రి ఎన్నో వివక్షతలను, కళంకాలను, కష్టనష్టాలను ఓర్చుకొని ట్రినిడాడ్ మరియు టొబాగో యొక్క ఫుట్‌బాల్ జట్టును ప్రపంచ కప్‌కు అర్హత సాధించడానికి తీవ్రంగా కృషిచేసి తద్వారా దేశాన్ని ఏకం చేయడంలో విజయం సాధించారని. ఆయనకు అంకితమిచ్చేందుకు ఒక రోజంటూ ఉండాలని, అదే రోజు ఒక మగాడికి ఉండే సమస్యలు, ఒత్తిడి మరియు సమాజంలో ఉన్న ప్రతికూలతలను తెలియజెప్పే ప్రయత్నంలో భాగంగా అప్పట్నించీ ఈరోజును ప్రాచుర్యంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో పలు అంతర్జాతీయ సంస్థల నుంది ఈరోజుకు మద్ధతు లభించింది.
ఇక చివరగా, ఈరోజు ప్రపంచ పురుషుల దినోత్సవం చేసుకుంటున్న మగ మహారాజులందరికీ హార్థిక శుభాకాంక్షలు. YO YO, Happy Men's Day bro.. అంటూ విష్ చేసుకోండి. అమ్మాయిలూ, మీరు కూడా మీ లైఫ్ లో ముఖ్యమైన వ్యక్తిగా భావించే అతడికి పురుషుల దినోత్సవం శుభాకాంక్షలు చెప్తూ, వారికి ఏవైనా బహుమతులు ఇచ్చి సంతోష పరచండి