దేశమంతటా దీపావళి (Diwali) సందడి మొదలైంది. ఈ పండగని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి, చేతులకు గోరింటాకు డిజైన్ ఎలా ఉండాలి , మొఖానికి ఎంత మేకప్ వేసుకోవాలి? అని ఆడవాళ్లు ఇప్పటికే వారివారి పనుల్లో బిజీ అయిపోయారు. మరి మగవాళ్లు? లక్ష్మీ బాంబు కాల్చాలి, సుతిలి బాంబులు పేల్చాలి, పక్కింటి వాళ్ల టాప్‌లు లేచిపోవాలి ఇలా ఆలోచిస్తారని అనుకుంటే పొరపాటే. వారు కూడా పద్ధతిగా ఎలాంటి సంప్రదాయమైన బట్టలు వేసుకోవాలి, నలుగురిలో ప్రత్యేక ఆకర్శణగా ఎలా నిలవాలి అని ఆలోచిస్తారు. అయితే మగవారు అందరిలా కాకుండా వైరైటీగా పండగను ఎలా జరుపుకోవాలి? నలుగురిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఎలా నిలవాలో చెప్పడం కోసమే ఈ వార్త.
మగవారూ.. ఇది మీకే! ఈ దీపావళి ఫ్యాషన్‌లో భాగంగా మగవారు తమ గడ్డాన్ని దీపాలతో అలంకరించుకునేలా మార్కెట్లో ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ దీపాలు వచ్చేశాయి. బీర్డ్ బాబుల్ (Beard baubles) లేదా బీర్డ్ లైట్స్ (Beard lights) గా పిలువబడే ఈ ఫ్యాషన్ ఆర్నమెంట్స్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇవి బ్యాటరీతో పనిచేసే అలంకరణాలు. బరువు తక్కువగా ఉండి, అత్యంత తేలికగా ఉండే ఈ బాబుల్స్‌ను మీ గడ్డం మీద హాయిగా ధరించవచ్చు. అమ్మాయిల జడ గంటల్లాగా, గడ్డానికి ఈ దీపాలు గాలికి అటు ఇటు ఊగుతూ ఉంటే అమ్మాయిల గుండె జారిపోతుంది. దీపావళి రాత్రి రోజు ఈ బాబుల్స్‌ను మీ గడ్డానికి సింగారించుకొని పటాకులు కాలుస్తూ ఉంటే, పండగ సంబరం అంతా మీ దగ్గరే ఉంటుంది.
Carry This as Your Diwali Look
గతంలో లవ్ ఫెయిల్ అయితే మగవారు గడ్డాలను పెంచుకునేవారు, కానీ ఇప్పుడు గడ్డం పెంచుకోవడం మగవారి స్టైల్ సింబల్. ఇప్పుడు మీ స్టైల్‌కి ఈ బాబుల్స్ తోడైతే (Diwali Swag) ఒక్కసారి ఊహించుకోండి. మీకు గడ్డం లేకపోతే తలకు పెట్టుకోండి, తలపైనా ఏమి లేకపోయినా ఏం పర్వాలేదు, ఈ బీర్డ్ బాబుల్స్‌తో కవర్ చేసేయండి, సింగారించుకోవడంలో అమ్మాయిలకు పోటీగా నిలవండి. అఫ్టరాల్.. 'వై షుడ్ గాల్స్ హావ్ ఆల్ ద ఫన్'?
మరి ఇంకేం వెంటనే మీ గడ్డానికి ఈ బీర్డ్ బాబుల్స్ ఆర్డర్ చేసేయండి. ఈ దీపావళి పండక్కి దీపాలతో పాటు, మీ గడ్డానికి బీర్డ్ బాబుల్స్ వెలిగించండి, పటాకులు తక్కువ కాల్చండి. వాయు కాలుష్యం నుంచి పర్యావరణాన్ని కాపాడండి.