laxmi devi

ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 3,1 నవంబర్ 1 న ప్రారంభం అవుతుంది. ఈ పండుగ రోజున లక్ష్మీదేవిని పూజించ సంప్రదాయం ఉంటుంది. దీని వల్ల మీ ఇంట్లో ఆనందం ఐశ్వర్యం తెస్తుంది. దీపావళి రోజు లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉండాలి. అంటే ఆమె ఆశీర్వాదాలు ఎప్పుడు మీపైన ఉండాలి. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీకు అదృష్టం సంపద పెరుగుతుందని అందరూ నమ్ముతారు. అయితే దీపావళి రోజు ఈ పనులు చేసినట్లయితే ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎప్పుడు మీపైనే ఉంటుంది.

తామర పువ్వులతో లక్ష్మీదేవిని పూజించాలి- లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పువ్వు తామర పువ్వు. దీపావళి రోజు లక్ష్మీదేవికి పూజ చేసిన తర్వాత తామర పువ్వుతో ఆ తల్లికి పూజలో పూజ చేసినట్లయితే మీకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి మంత్రాన్ని జపించి పూజ చేసినట్లయితే మీకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ మీ పైన ఉండి మీకు అన్ని ఐశ్వర్యాలు సంతోషాలు మీ కోరికలు నెరవేరుతాయి..

 పాయసం- దీపావళి రోజు లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు బియ్యంతో చేసిన పాయసాన్ని ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఉంటుంది. లక్ష్మీదేవి పూజ అయ్యే వరకు ఉపవాసం ఉండి ఆ తర్వాత అన్నం పాయసాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించినట్లయితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ పైన ఉంటుంది.

Vastu Tips: ఈ వస్తువులు పర్సులో పెట్టుకుంటే డబ్బుకు ఇబ్బంది ఉండదు .

గుమ్మం ముందు ముగ్గు పెట్టండి- దీపావళి రోజు ఇంటిని శుభ్రంగా చేసుకొని ఇంటిముందు రంగుల ముగ్గురు వేసుకున్నట్లయితే ఆ లక్ష్మీదేవి కృప మీ పైన ఎల్లప్పుడూ ఉంటుంది. పరిశుభ్రత ఉండే ప్రదేశంలో మాత్రమే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని పెద్దలు చెబుతారు. కాబట్టి దీపావళి రోజున మీ ఇంటి ముఖద్వారం వద్ద లక్ష్మీదేవికి పాదాలు వేసి ఇంటిని ముగ్గులతో అలంకరించుకున్నట్లయితే ఆ ఇల్లు ఎప్పటికీ ఐశ్వర్యంతో ఉంటుంది.

ఇంటి చుట్టూ దీపాలు అలంకరణ- దీపావళి రోజు ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా కూడా పువ్వులతో అలంకరించడం చాలా ముఖ్యం. ఇలా ఉండడం వల్ల ఆ లక్ష్మీదేవి తన లక్ష్మీదేవిని మన ఇంటికి స్వాగతించినట్లుగా అనిపిస్తుంది. అంతే విధంగా దీపావళి రోజు దీపాలను ఇంటి చుట్టూ వెలిగించడం ద్వారా కూడా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.