Happy New Year 2025: వీడియో ఇదిగో, 2025 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికిన ఆస్ట్రేలియా, అందరికంటే ముందే 2025కి స్వాగతం పలికిన కిరిబాటి దీవులు
ఆస్ట్రేలియా తూర్పు తీరంలోని సిడ్నీ నగరం 2025 సంవత్సరానికి వెల్కమ్ చెప్పింది.కళ్లు మిరుమిట్లు గొలిపేలా బాణసంచా విన్యాసాలు, ఆకట్టుకునే లేజర్ లైటింగ్ తో ప్రఖ్యాత సిడ్నీ హార్బర్, ఓపెరా హౌస్ జిగేల్మన్నాయి.
2025 సంవత్సరానికి ఆస్ట్రేలియా ఘనంగా స్వాగతం పలికింది. ఆస్ట్రేలియా తూర్పు తీరంలోని సిడ్నీ నగరం 2025 సంవత్సరానికి వెల్కమ్ చెప్పింది.కళ్లు మిరుమిట్లు గొలిపేలా బాణసంచా విన్యాసాలు, ఆకట్టుకునే లేజర్ లైటింగ్ తో ప్రఖ్యాత సిడ్నీ హార్బర్, ఓపెరా హౌస్ జిగేల్మన్నాయి.
వేలాది మంది ప్రజలు సిడ్నీ హార్బర్ వద్దకు చేరుకుని నూతన సంవత్సర ఘడియలను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. తోటివారికి హ్యాపీ న్యూయర్ చెబుతూ 2025లోకి ప్రవేశించారు. మన పొరుగు దేశాలు భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ మనకంటే 30 నిమిషాల ముందు నూతన సంవత్సరంలోకి అడుగుపెడతాయి.
ఇక రేపు ఉదయం మనకు 10.30 గంటలు అయినప్పుడు అమెరికాలోని న్యూయార్క్ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతుంది. రష్యాలో కొత్త సంవత్సర వేడుకలను రెండు సార్లు జరుపుకుంటారు.
గ్రెగెరియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి 1న.... పాత జూలియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి 14న న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ జరుపుకుంటారు. సౌదీ అరేబియా, చైనా, ఇజ్రాయెల్, వియత్నాం దేశాలు జనవరి 1న కొత్త సంవత్సరాన్ని జరుపుకోవు. ఆయా దేశాల క్యాలెండర్ల ప్రకారం కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటారు.
Australia Welcomes 2025 with Spectacular Fireworks Display at Sydney Harbour
అన్నింటికంటే ముందు పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటి దీవులు 2025కి స్వాగతం పలికాయి. భానుడి కిరణాలు మొదట పడే పసిఫిక్ మహా సముద్ర ప్రాంత దేశాలు మొదట కొత్త ఏడాది సంబరాలు జరుపుకుంటాయి. ఆఖరున హౌలాండ్ వంటి దీవులు కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతాయి.
ఇక వ్యోమగాములు మాత్రం 16 సార్లు కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు. దీనికి కారణం ఏంటంటే.. అంతరిక్షంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గంటకు 28 వేల కిలోమీటర్లు తిరుగుతూ 90 నిమిషాల్లో భూమిచుట్టూ ఒక రౌండ్ పూర్తి చేసుకుంటుంది. అంటే 24 గంటల్లో భూమిచుట్టూ 16 సార్లు తిరుగుతుంది. అందుకే వ్యోమగాములకు కొత్త ఏడాదికి 16సార్లు స్వాగతం పలికే అవకాశం ఉంటుంది. వ్యోమగాములు ప్రతి 45 నిమిషాలకు ఒకసారి సూర్యోదయాన్ని, ప్రతి 45 నిమిషాలకు ఒకసారి సూర్యాస్తమయాన్ని చూస్తారు.