Varalakshmi Vratam 2023: ఆగస్టు 25న వరలక్ష్మీ వ్రతం రోజు ఈ మంత్రం చదివితే, వద్దన్నా డబ్బు మీ ఇంట్లో వర్షం కురిసినట్లు కురవడం ఖాయం..
కొన్నిసార్లు వరలక్ష్మి దేవి వ్రతం జరిపేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉండవు అలాంటి సమయంలో ఈ శక్తివంతమైన మంత్రాలను చదవడం ద్వారా వరలక్ష్మీదేవి వ్రతం ఆచరించడం వల్ల కలిగే పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి,
శ్రావణమాసంలో వరలక్ష్మి దేవి వ్రతం అనగానే మహిళలు ఎంతో ఉత్సాహంతో ఉదయాన్నే లేచి స్నానాదులు ముగించి, ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తార. వరలక్ష్మి వ్రతం అంటేనే వరాలు ఇచ్చే తల్లి పండగ ఈ వరలక్ష్మి దేవి వ్రతం రోజున మహిళలు తమ కుటుంబ సభ్యుల కోసం వ్రతం ఆచరిస్తారు అలాగే వారి బాగోగుల కోసం నోములు నోచుకుంటారు. అయితే వరలక్ష్మీదేవి వ్రతం రోజున కొన్ని శక్తివంతమైన మంత్రాలు జపించడం వల్ల వరలక్ష్మి దేవి వరాలు కురిపిస్తుందని పండితులు చెబుతున్నారు. కొన్నిసార్లు వరలక్ష్మి దేవి వ్రతం జరిపేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉండవు అలాంటి సమయంలో ఈ శక్తివంతమైన మంత్రాలను చదవడం ద్వారా వరలక్ష్మీదేవి వ్రతం ఆచరించడం వల్ల కలిగే పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి, అలాంటి శక్తివంతమైన ఓ మంత్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వరలక్ష్మీదేవి మంత్రం :
నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః
కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మై నమో నమః
పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమో నమః
పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమో నమః
సర్వసంపత్స్వరూపిణ్యై సర్వారాధ్యై నమో నమః
హరిభక్తిప్రదాత్ర్యై చ హర్షదాత్ర్యై నమో నమః
ఈ మంత్రం చదివే ముందు వరలక్ష్మి దేవి చిత్రపటం ముందు దీపం వెలిగించి అగరవత్తులు ముట్టించి నిష్టతో మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి వరలక్ష్మి దేవికి నమస్కారం చేసుకోవాలి. అలాగే మీ భర్త నుంచి ఆశీర్వాదం పొందాలి ఇలా చేసినట్లయితే వరలక్ష్మి దేవి వ్రతం చేసినంత పుణ్యం మీకు లభిస్తుంది. అలాగే శక్తివంతమైన మంత్రం చదవడం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లో నివాసం ఉంటుంది