Adhika Shravana Masam: అధిక శ్రావణమాసంలో ఈ నాలుగు రాశులవారికి ధన లక్ష్మీ దేవి కటాక్షంతో కోటీశ్వరులు అయ్యే అవకాశం, మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..?

అధిక శ్రావణమాసం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తేబోతోంది ఈ రాశుల వారు అధిక శ్రావణ మాసంలో లక్ష్మీదేవి కటాక్షంతో కోటీశ్వరులు కాబోయే అవకాశం ఉంది.

Image credit - Pixabay

జూలై 18 నుంచి అధిక శ్రావణమాసం ప్రారంభం అవుతుంది ఈ మాసం ఆగస్టు 16 వరకు కొనసాగుతుంది. ఆ తరువాత ఆగస్టు 17 నుంచి నిజ శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. అధికమాసం శూన్యమాసం అని కూడా అంటారు. దాదాపు 19 సంవత్సరాల తర్వాత అధిక శ్రావణమాసం వచ్చింది. ఈ నేపథ్యంలో అధిక శ్రావణమాసం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తేబోతోంది ఈ రాశుల వారు అధిక శ్రావణ మాసంలో లక్ష్మీదేవి కటాక్షంతో కోటీశ్వరులు కాబోయే అవకాశం ఉంది. అధిక శ్రావణ మాసంలో ధనలక్ష్మి దేవి కటాక్షం ఉన్న రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వృషభ రాశి

ఈ రాశి వారికి అధిక శ్రావణమాసం అదృష్టాన్ని తేబోతోంది. ముఖ్యంగా విద్యార్థులు వ్యాపారులకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది. వ్యాపారులు ఈ మాసంలో చాలా లాభాన్ని పొందుతారు. పాత అప్పులు వసూలు అవుతాయి. అలాగే ఈ రాశి వారికి ఈ మాసం పట్టిందల్లా బంగారం అవుతుంది. అధిక శ్రావణమాసం వృషభ రాశి వారికి అన్ని రంగాల్లో విజయాలను తెచ్చిపెడుతుంది.

కన్యా రాశి

అధిక శ్రావణ మాసంలో ఈ రాశి వారు శుభవార్తలను వింటారు. అంతేకాదు ఈ రాశి వారికి విద్యా వ్యాపార రంగాల్లో అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి ఈ మాసం చాలా బాగా కలిసి వస్తుంది. అనుకొని లాభాలను పొందే అవకాశం ఉంది. కన్యా రాశి వారు అధిక శ్రావణ మాసంలో, శివాలయం వెళ్లి ప్రతి సోమవారం 11 దీపాలు వెలిగించి, ఓం నమశివాయ మాత్రం జపిస్తే అంతా శుభం జరుగుతుంది.

మిధున రాశి

అధిక శ్రావణ మాసంలో మిధున రాశి వారికి అన్ని రంగాల్లో విజయం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపారులు అదేవిధంగా పారిశ్రామికవేత్తలు అనుకోని లాభాలను పొందే అవకాశం ఉంది మీరు కూడా ఈ రాశి వారు అయినట్లయితే త్వరలోనే శుభవార్త వినే అవకాశం ఉంది. మిథున రాశి వారు ఈ మాసంలో సుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తే మంచిది. సుబ్రహ్మణ్యస్వామి పటం ముందు ప్రతిరోజు రెండు దీపాలు వెలిగించి ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమః అని జపం చేయడం ద్వారా చక్కటి ఫలితాలు లభిస్తాయి.

Vastu Rules For TV: వాస్తు ప్రకారం ఇంట్లో టీవీ ఏ దిక్కులో ఉండాలో తెలుసా ...

కర్కాటక రాశి

ఈ రాశి వారు అధిక శ్రావణమాసంలో అద్భుతమైన విజయాలను పొందే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశి వారు అటు వ్యాపార రంగంలోనూ, ఉద్యోగ రంగంలోనూ గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. ఈ మాసంలో కర్కాటక రాశి వారు ఆంజనేయ స్వామి గుడిలోకి వెళ్లి ప్రతి మంగళవారం 11 దీపాలు వెలిగించి పూజ చేయడం ద్వారా మంచి ఫలితాలు లభించే అవకాశం ఉంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif