Long Weekends in 2024: రాబోయే నెలల్లో లాంగ్ వీకెండ్స్ జాబితా ఇదిగో.. సెలవు తీసుకోకుండానే ఈ సెలవులను వాడుకోండి, విహారయాత్రలకు ప్లాన్ చేసుకోండి, రెచ్చిపోండి!

Long-Weekends-In-2024: File Photo

Long Weekends in 2024: నేడు సగటు మనిషి జీవితం ఎలా ఉందంటే.. కాలంతో సమానంగా పరుగులు తీయాల్సిన పరిస్థితి. రోజూవారీగా ఉండేటువంటి బిజీ స్కెడ్యూల్స్, వారం మొత్తం విరామం లేకుండా పనులు చేస్తుండంటం, చివరకు అలిసిపోయి వీకెండ్ కోసం ఎదురుచూడటం సర్వసాధారణమైపోయింది. తీరా ఆ వీకెండ్ ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం, ఆపై మళ్లీ రొటీన్ జీవితం. ఇప్పుడు చాలామంది ఇదే లైఫ్‌స్టైల్‌లో జీవిస్తున్నారు. చాలిచాలని విరామాలతో ఏవైనా ప్రయాణాలు, యాత్రలు చేయడానికి కూడా తీరిక ఉండటం లేదు. వారంలో నాలుగు రోజుల పని ఉంటే ఎంత బాగుంటుంది అని కలలు కనేవారు ఇప్పటికీ చాలామందే ఉంటారు. మీలాంటి వారి కోసమే ఈ కథనంలో లాంగ్ వీకెండ్స్ గురించి తెలియజేస్తున్నాం.

2024 సంవత్సరంలో కూడా చాలానే లాంగ్ వీకెండ్స్ వచ్చాయి. రాబోవు నెలల్లో పండుగలతో కలిసి వస్తున్న లాంగ్ వీకెండ్స్ జాబితాను ఇక్కడ అందిస్తున్నాము. సరిగ్గా ప్లాన్ చేస్తే సెలవు తీసుకోకుండానే సెలవులను ఎంజాయ్ చేయవచ్చు. మీ కుటుంబం లేదా స్నేహితులతో కలిసి ఏదైనా విహారయాత్ర ప్లాన్ చేయవచ్చు.

మార్చి 2024లో లాంగ్ వీకెండ్స్ తేదీలు

మార్చి 8, శుక్రవారం, మహాశివరాత్రి

మార్చి 9, శనివారం

ఆదివారం, మార్చి 10, ఆదివారం

మార్చి 23, శనివారం

మార్చి 24, ఆదివారం

మార్చి 25, సోమవారం, హోలీ

మార్చి 29, శుక్రవారం, గుడ్ ఫ్రైడే

మార్చి 30, శనివారం

మార్చి 31: ఆదివారం, ఈస్టర్ ఆదివారం

మే 2024లో లాంగ్ వీకెండ్స్ తేదీలు

మే 23, గురువారం, బుద్ధ పూర్ణిమ

మే 24: ఒకరోజు సెలవు తీసుకోండి

మే 25, శనివారం

మే 26, ఆదివారం

జూన్ 2024లో లాంగ్ వీకెండ్స్ తేదీలు

జూన్ 15, శనివారం

జూన్ 16, ఆదివారం

జూన్ 17, సోమవారం, బక్రీద్

ఆగస్ట్ 2024లో లాంగ్ వీకెండ్స్ తేదీలు

ఆగస్టు 15, గురువారం, స్వాతంత్య్ర దినోత్సవం

ఆగస్టు 16, శుక్రవారం: ఒకరోజు సెలవు తీసుకోండి

ఆగస్టు 17, శనివారం,

ఆగస్టు 18, ఆదివారం

ఆగస్టు 19, సోమవారం, రక్షా బంధన్ (ఐచ్ఛిక సెలవు)

ఆగస్టు 24, శనివారం

ఆగస్టు 25, ఆదివారం

ఆగస్టు 26, సోమవారం, జన్మాష్టమి

సెప్టెంబర్ 2024లో లాంగ్ వీకెండ్స్ తేదీలు

సెప్టెంబర్ 5, గురువారం, ఓనం (పరిమిత సెలవు)

సెప్టెంబర్ 6, శుక్రవారం: సెలవు తీసుకోండి

సెప్టెంబర్ 7, శనివారం: గణేష్ చతుర్థి

సెప్టెంబర్ 8, ఆదివారం

సెప్టెంబర్ 14, శనివారం

సెప్టెంబర్ 15, ఆదివారం

సెప్టెంబర్ 15, సోమవారం, ఈద్ మిలాద్ ఉన్ నబీ.

అక్టోబర్ 2024లో లాంగ్ వీకెండ్స్ తేదీలు

అక్టోబర్ 11, శుక్రవారం, మహా నవమి

అక్టోబర్ 12, శనివారం, దసరా

అక్టోబర్ 13, ఆదివారం

నవంబర్ 2024 లో లాంగ్ వీకెండ్స్ తేదీలు

నవంబర్ 1, శుక్రవారం, దీపావళి

నవంబర్ 2, శనివారం

నవంబర్ 3, ఆదివారం

నవంబర్ 15, శుక్రవారం, గురునానక్ జయంతి

నవంబర్ 16, శనివారం

నవంబర్ 17, ఆదివారం

అప్పుడప్పుడూ పని నుంచి సెలవులు తీసుకొని ఆనందంగా గడపడం వల్ల మనసు రిఫ్రెష్ అవుతుంది, మీరు రీఛార్జ్ అవుతారు, మీ పనితీరు మెరుగుపడుతుంది. తద్వారా ఉత్పాదకత పెరుగుతుందని అధ్యయనాలు తెలిపాయి.  కాబట్టి ఈ లాంగ్ వీకెండ్స్ తేదీలను ఉపయోగించుకొని హాయిగా రిలాక్స్ అవ్వండి, రిఫ్రెష్ అయిపోండి.



సంబంధిత వార్తలు

Bank Holidays in 2025: బ్యాంక్ సెలవుల జాబితా 2025 ఇదిగో, పండుగల నుండి జాతీయ సెలవులు వరకు బ్యాంక్ సెలవుల పూర్తి జాబితాను తెలుసుకోండి

Tech Layoffs 2024: ఈ ఏడాది భారీగా టెక్ లేఆప్స్, 1,50,034 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపిన 539 కంపెనీలు, ఏఐ టెక్నాలజీ రావడంతో రోడ్డున పడుతున్న ఉద్యోగులు

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Happy New Year 2025: కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.