Christmas Wishes: క్రిస్టమస్ పండుగ చరిత్ర ఏమిటి, అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు, మీ బంధువులకు, స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పేందుకు కొన్ని కోటేషన్స్ మీకోసం

క్రిస్టమస్ క్రైస్తవులకు అతి ముఖ్యమైన పండుగ.. క్రైస్తవుల ఇంట నెల రోజుల ముందు నుంచే పండుగ వాతావరణం (Merry Christmas 2020) నెలకొంటుంది. మన దేశంలో మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ క్రిస్మస్ (Christmas) వేడుకలో భాగస్వాములవుతారు. క్రిస్టియన్ సోదరులను శుభాకాంక్షలతో (Merry Christmas Greetings) ముంచెత్తుతారు. ఏసుక్రీస్తు జన్మదిన సందర్భంగా క్రైస్తవులు ఈ పండుగను జరుపుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు.

Merry Christmas (File Image)

క్రిస్టమస్ క్రైస్తవులకు అతి ముఖ్యమైన పండుగ.. క్రైస్తవుల ఇంట నెల రోజుల ముందు నుంచే పండుగ వాతావరణం (Merry Christmas 2020) నెలకొంటుంది. మన దేశంలో మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ క్రిస్మస్ (Christmas) వేడుకలో భాగస్వాములవుతారు. క్రిస్టియన్ సోదరులను శుభాకాంక్షలతో (Merry Christmas Greetings) ముంచెత్తుతారు. ఏసుక్రీస్తు జన్మదిన సందర్భంగా క్రైస్తవులు ఈ పండుగను జరుపుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు.

క్రిస్టమస్ పండుగ చరిత్రలోకి వెళితే.. రోమన్ సామ్రాజ్యంలోని నజరేతు పట్టణంలో ఉండే మేరీతో జోసెఫ్‌కు పెళ్లి కుదిరింది. అయితే ఒక రోజున మేరీకి గాబ్రియేల్ అనే దేవదూత కలలో కనబడి కన్యగానే గర్భం దాల్చి ఓ కుమారునికి జన్మనిస్తావని తెలిపిందట. అంతే కాదు పుట్టే బిడ్డకు ఏసు అని పేరు పెట్టాలని, అతడు దేవుని కుమారుడు' అని దేవదూత చెప్పాడు. ఏసు అంటే రక్షకుడు అని అర్థం. దేవదూత చెప్పిన విధంగానే మేరీ గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన జోసెఫ్ ఆమెను వివాహం చేసుకోరాదని నిర్ణయించుకున్నాడు. అయితే ఒక రోజు రాత్రి కలలో అతనికి దేవదూత కనపడి' మేరీని నీవు విడిచిపెట్టవద్దు. ఆమె భగవంతుని వరం వల్ల గర్భవతి అయింది. కాబట్టి ఆమెకు పుట్టే కొడుకు దేవుని కుమారుడు. తనను నమ్మిన ప్రజలందరిని వాళ్ల పాపాల నుంచి రక్షిస్తాడు.' అని చెప్పాడు.

భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు, దశావతారాల్లో దర్శనమివ్వనున్న శ్రీరామచంద్రులు, డిసెంబర్ 15 నుంచి జనవరి 4 వరకు ఉత్సవాలు

తరువాత జోసెఫ్ మేరీ స్వగ్రామం బెత్లేహేమ్‌కు వెళ్లారు. తీరా అక్కడకు చేరుకునేసరికి ఉండటానికి వసతి దొరకలేదు. చివరకు ఒక సత్రం యజమాని తన పశువుల పాకలో వారికి ఆశ్రయం ఇచ్చాడు. అక్కడే మేరీ ఏసుకు జన్మనిచ్చింది. అలా రెండు వేల సంవత్సరాల కిందట డిసెంబరు 24 న అర్థరాత్రి 12 తర్వాత జీసస్ జన్మించాడు. అంటే డిసెంబరు 25న జన్మించడంతో ఆ రోజునే క్రిస్మస్ జరుపుకుంటారని చెబుతారు.

క్రిస్‌మస్‌కు చాలా రోజుల ముందే పండుగ సందడి మొదలవుతుంది. దీనికోసం క్రైస్తవులు తమ ఇళ్లను, చర్చ్‌లను అందంగా అలంకరిస్తారు. వెదురు బద్దలు, రంగుల కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారుచేసి ఇంటిపై వేలాడ దీస్తారు. అలాగే తమ ఇంట్లో క్రిస్‌మస్‌ ట్రీ ఏర్పాటు చేస్తారు. దీన్ని రంగు రంగుల కాగితాలు, నక్షత్రాలు, చిరుగంటలు, చిన్న చిన్న గాజు గోళాలతోను అలంకరిస్తారు. ఇది ఈ పండుగ ప్రత్యేకత. పశ్చిమ దేశాల్లో ఈ క్రిస్‌మస్‌ సంబరాలు డిసెంబర్ నెల మొదటివారం నుండే ప్రారంభమవుతాయి.

శుభాకాంక్షలు ఇలా చెప్పేద్దాం

మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్‌మస్‌ శుభాకాంక్షలు

క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు.

క్రీస్తు జన్మించిన ఈ శుభదినం మీ అందరికీ శాంతి సౌక్యాలను తేవాలని మనసారా కోరుకుంటూ క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు.

క్రీస్తు జన్మించిన ఈ శుభదినం మీ అందరికీ శాంతి, సౌభాగ్యాలను కలుగజేయాలని ఆశిస్తూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు

సాటి మ‌నుషుల ప‌ట్ల ప్రేమ‌, నిస్స‌హాయుల ప‌ట్ల క‌రుణ‌, శ‌త్రువుల ప‌ట్ల క్ష‌మ వంటి క్రీస్తు సందేశాలు మ‌న‌ల‌ను స‌న్మార్గంలో నడిపించాలని, రాష్ట్ర ప్ర‌జ‌ల‌పై క్రీస్తు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు.

ప్రేమ, శాంతి, కరుణ బోధించిన ప్రభువు దీవెనలు అందరిపై ఉండాలని కోరుతూ క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.

సమాజంలో స్థిరపడిపోయిన అజ్ఞానాన్ని, స్వార్థాన్ని, మాలిన్యాన్ని ప్రక్షాళన చేసి సమాజాన్ని సంస్కరించేందుకు వచ్చినవారే యుగకర్తలు. మానవాళికి శాంతి, ప్రేమలతో కూడిన జీవన మార్గాన్ని ఉపదేశించిన క్రీస్తు నిజమైన సంస్కరణవాది. క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు!

మానవాళికి ప్రేమ, కరుణ, దయ, శాంతి మార్గం చూపిన ఏసుక్రీస్తు జ‌న్మ‌దినం క్రైస్త‌వ సోదరుల‌కు ప‌ర్వ‌దినం.క్రిస్మ‌స్ సంద‌ర్భంగా ప్రేమ‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now