Nagula Chavithi 2024 Wishes in Telugu: నాగుల చవితి శుభాకాంక్షలు మీ స్నేహితులు, బంధువులకు తెలియజేయాలని ఉందా..అయితే ఈ ఫోటో గ్రీటింగ్స్ మీ కోసం..
నాగుల చవితి రోజున పాముని పూజించడం వల్ల విశేష ప్రయోజనాలున్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం, నాగుల చవితి పండుగ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని శుక్ల పక్షం చవితి రోజున జరుపుకుంటారు.
హిందూ మతంలో పామును దేవతగా పూజిస్తారు. నాగుల చవితి రోజున పాముని పూజించడం వల్ల విశేష ప్రయోజనాలున్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం, నాగుల చవితి పండుగ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని శుక్ల పక్షం చవితి రోజున జరుపుకుంటారు. ఈ రోజున నాగరాజును పూజించడం ద్వారా జీవితంలో విజయాలు సాధించవచ్చు. నాగుల చవితి పండుగను ఎందుకు జరుపుకుంటారో దానికి సంబంధించిన పౌరాణిక కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నాగుల చవితి రోజున నాగదేవతను పూజించడం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం. నాగ చవితి పండుగను జరుపుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. పరమశివుడికి పాములు అంటే చాలా ఇష్టం. వాసుకి అనే పామును కూడా శివుడు మెడలో వేసుకుంటాడు. నాగుల చవితి రోజున పాములను పూజించడం ద్వారా, శివానుగ్రహం లభిస్తుంది. నాగ చవితి రోజున పాములను పూజించడం వల్ల జాతకం నుండి కాల సర్ప్ దోషం తొలగిపోతుందని కూడా నమ్ముతారు.
నాగేంద్రుని ఆశీస్సులు మన అందరి పైన ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు
కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ| ఋతుపర్ణస్య రాజ కీర్తనం కలినాశనమ్|| అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు..
ఆ పరమేశ్వరుడు మీకు బలం మరియు శ్రేయస్సు అనుగ్రహించాలని కోరుతూ... ఆ నాగేంద్రుని ఆశీస్సులు మీ అందరిపైనా ఉండాలని ఆశిస్తూ... మీకు, మీ కుటుంబసభ్యులకు నాగుల చవితి శుభాకాంక్షలు
నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ, తస్మైన కారాయ నమ శివాయ.. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు.
నాగుల చవితి పర్వదినం సందర్భంగా ఆ పరమేశ్వరుడు, నాగేంద్రుడు మన అందరికీ శక్తి, శ్రేయస్సు అనుగ్రహించాలని కోరుకొంటూ ప్రజలందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు