Nagula Chavithi: ఈ ఏడాది నాగుల చవితి అక్టోబర్ 28న జరుపుకోవాలి, నాగుల చవితి రోజు ఏం చేయాలి, మహిళలు ఏం చేయాలో తెలుసుకోండి..

నాగ అంటే పాము చతుర్థి అంటే 4వ రోజు.ఈ సంవత్సరం నాగుల చవితి అక్టోబర్ 28న జరుపుకుంటున్నారు. ఇది నాగ దేవతలకు అంకితం చేసిన పండగ, ఇది భారతదేశం అంతటా ప్రధానంగా తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో జరుపుకుంటారు.

nagula chavithi Wishes in telugu (Photo Credits: File Image)

కార్తీక మాసంలో 4వ రోజు నాగుల చవితిగా జరుపుకుంటారు. నాగ అంటే పాము చతుర్థి అంటే 4వ రోజు.ఈ సంవత్సరం నాగుల చవితి అక్టోబర్ 28న జరుపుకుంటున్నారు. ఇది నాగ దేవతలకు అంకితం చేసిన పండగ, ఇది భారతదేశం అంతటా ప్రధానంగా తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో జరుపుకుంటారు. 

నాగుల చవితి ప్రాముఖ్యత: నాగుల చవితి వ్రతం అంటే స్త్రీలు తమ భర్త, పిల్లల శ్రేయస్సు, దీర్ఘాయువు కోసం ఉపవాసం ఆచరిస్తారు. ఈ పవిత్రమైన రోజున నాగ దేవతను ఆరాధించడం వల్ల జీవితం నుండి ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని నమ్ముతారు.

నాగుల చవితి ఆచారాలు: భక్తులు ఈ రోజు ఉపవాస దీక్ష ఆచరిస్తారు. దేవాలయాలను సందర్శించి పాము పుట్టకు నీరు, పాలతో స్నానం సమర్పిస్తారు. నాగరాజు విగ్రహాలకు పసుపు, కుంకుమ వేస్తారు. వారు అగర్బత్తీలు, ప్రసాదాన్ని అందిస్తారు.

యూపీలో దారుణం, యువతి రక్తంతో రోడ్డు మీద పడి ఉంటే సెల్ఫీలు దిగుతూ చోద్యం చూసిన స్థానికులు,బాధితురాలిని భుజం మీద వేసుకుని ఆస్పత్రికి తీసుకువెళ్లిన పోలీస్

ఈ రోజు సర్ప సూక్తం (నాగ దేవతలను స్తుతించే శ్లోకాలు) జపిస్తారు. అనంత, వాసుకి, శేష, పద్మనాభ, కంబళ, ధృతరాష్ట్ర, శంఖపాల, తక్షకుడు, కాళియ - తొమ్మిది ముఖ్యమైన పాము దేవతల ఆశీస్సులు పొందడానికి ఈ మంత్రాలను జపిస్తారు.

నాగుల చవితి: శుభ ముహూర్తం

హిందూ కాలెండర్ ప్రకారం, నాగుల చవితి అక్టోబర్ 28 , 2022న ఉదయం 04:18 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 29, 2022 ఉదయం 05:13 గంటలకు ముగుస్తుంది. శుభ ముహూర్తం లేదా మంచి సమయం మధ్యాహ్నం 02:03 నుండి 03:43 వరకు ఉంది.