Karthika Pournami 2022: నవంబర్ 8న కార్తీక పౌర్ణమి, ఈ రోజు పరమశివుడికి ఈ ఆకులతో పూజ చేస్తే, కష్టాలు పోయి కోటీశ్వరులు అవుతారు..
పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజు పరమశివుడు త్రిపుర అనే రాక్షసుడిని సంహరించడనే పేరుంది. కార్తీక పౌర్ణమి అత్యంత పర్వదినమైన పండుగగా భావించి పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలను సందర్శించి కార్తీక దీపాలను వెలిగిస్తారు.
కార్తీకమాసం అంటేనే శివుడికి చాలా ఇష్టమైన మాసం. పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజు పరమశివుడు త్రిపుర అనే రాక్షసుడిని సంహరించడనే పేరుంది. కార్తీక పౌర్ణమి అత్యంత పర్వదినమైన పండుగగా భావించి పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలను సందర్శించి కార్తీక దీపాలను వెలిగిస్తారు. అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజు సకల దేవతలు అందరూ నదిలో దిగి స్నానాలు ఆచరిస్తారని భావిస్తారు కనుక నదీస్నానాలు చేయడం వల్ల ఆ దేవ దేవుని ఆశీర్వాదం మనపై ఉంటుంది.
కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ఎంతో పవిత్రంగా నియమనిష్టలతో పూజ చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ముఖ్యంగా మీ రాశిలో సూర్యుడు బలపడాలంటే బిల్వ పత్రాలతో ఆ పరమేశ్వరుడిని పూజించాలి.అదేవిధంగా మహా విష్ణువుకి నెయ్యితో దీపారాధన చేసి పాయసం నైవేద్యంగా సమర్పించాలి.ఎంతో పవిత్రమైన ఈ పర్వదినాన పితృదేవతలకు తర్పణాలు పెట్టడం వల్ల వారి ఆత్మ శాంతిస్తుంది.
అలాగే తులసి మొక్క ముందు దీపం వెలిగించడం వల్ల అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మన పై ఉండి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు సమస్యలు లేకుండా బయటపడతారు.