Gold Buying: బంగారం కొనే ముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవిగో, మీ డబ్బు సేవ్ చేసుకోవాలంటే తెలుసుకోక తప్పదు మరి
ఇలాంటి సందర్భంలోనే చాలా మంది బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అయితే మీరు కూడా బంగారు ఆభరణాల్నికొనాలనుకుంటున్నారా ? అలా అయితే ఈ కింది విషయాలను తప్పక తెలుసుకోండి.
పండుగలు శుభకార్యాలు మొదలయ్యాయి. ఇలాంటి సందర్భంలోనే చాలా మంది బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అయితే మీరు కూడా బంగారు ఆభరణాల్నికొనాలనుకుంటున్నారా ? అలా అయితే ఈ కింది విషయాలను తప్పక తెలుసుకోండి. శుభాకార్యాల వాతావరణం మొదలయ్యింది. అతి త్వరలోనే దీపావళి పండుగ కూడా వచ్చేస్తోంది. ఇలాంటి సందర్భంలోనే చాలా మంది బంగారం కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. అయితే బంగారం విషయంలో మేకింగ్ ఛార్జీలు, బంగారం ధర వంటి అంశాల్లో అవగాహన లేకుండనే బంగారం కొనేస్తుంటారు.
దాంతో పాటు తెలియకుండానే ఆభరణాలపై అధికంగా డబ్బులు చెల్లించి వస్తుంటారు. పండుగనే కాకుండా ఎలాంటి సందర్భంలోనైనా సరే.. బంగారం కొనుగోలు చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి.
బంగారం కొనుక్కునే ముందు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది బంగారం ధర. ప్రతిరోజు ఈ బంగారం ధర నిత్యం మారుతూనే ఉంటుంది.స్థిరంగా ఓకే ధర ఉండదు. నగరం ప్రాంతాల ఆధారంగా చేసుకొని ధరలో తేడాలు వస్తుంటాయి. ఎప్పుడైన బంగారం స్వచ్చతమైన ఆభరణాల ధరపై ఆధారపడి ఉంటుంది. అందుకోసమనే వీటిని కొనుక్కునే సమయంలో ప్రస్తుతం బంగారం ధర ఎంత?దాని స్వచ్చత ఎలా ఉంది అని.. ఇలా అన్ని విషయాల గురించి తెలుసుకోవటం చాలా ముఖ్యం.
ధనత్రయోదశి రోజు చేయాల్సిన పనులు ఇవే, ఈ తప్పులు చేశారో లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురవడం ఖాయం..
మనకు హడావుడిగా ఉన్న సమయంలో బంగారం కొనడం సరైన పద్ధతి కాదు. ముఖ్యంగా బంగారు ఆభరణాలు కొనుక్కునే ముందు.వేర్వేరు నగల దుకాణాలకు వెళ్లి ధరల్ని పరీశీలించి.. వాటి నాణ్యత ఎలా ఉంది అని కనుక్కొని నిర్ణయం తీసుకోవాలి. అదే విధంగా మేకింగ్ ఛార్జీలు ఎంత మొత్తంలో ఏ విధంగా విధిస్తున్నారని తెలుసుకోవాలి.ఇలాంటి ప్రతి దాని గురించి తెలుసుకొని.. అప్పుడు మనకు ఏ దుకాణంలో తక్కువ అనిపిస్తే అక్కడ కొనుక్కోండి.
బంగారం ధరకు మీరు కొనుక్కునే ఆభరణాల ధరకు చాలా వ్యత్యాసం ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే.. మేకింగ్ చార్జీలు అందులో కలపడమే. సాధారణంగా ఎక్కడయినా మేకింగ్ చార్జీలు 6 శాతం నుంచి 20 శాతం వరకు ఉంటాయి. మెషీన్ తో తయారు చేసే జ్యువేలరీకి, తక్కువ డిజైన్ తో చేసి ఉన్న నగలకు మేకింగ్ ఛార్జీలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకోసమని సులభమైన డిజైన్ ఎంచుకోవడం చాలా ఉత్తమం. చాలా మంది అయితే కొనుక్కునే సమయానికి మేకింగ్ ఛార్జీలపై రాయితీలు, తక్కువ డిస్కౌంట్లు ఇవ్వడానికి సిద్దంగా ఉంటారు. అలాంటి సమయాల్లో మేకింగ్ ఛార్జీలపై బేరం ఆడి తీసుకోండి.
ఎక్కువగా బంగారం కొనుక్కునే ముందు తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం దాని స్వచ్చత. బంగారం స్వచ్చతను క్యారెట్లలో కొలుస్తారు.24 క్యారెట్లులో బంగారాన్ని స్వచ్చమైన బంగారంగా చెబుతారు. కానీ ప్రస్తుతం అయితే మనం కొనుక్కునే బంగారం ఆభరణాలు మాత్రం 22 క్యారెట్లు బంగారంలో ఉంటాయి. 24 క్యారెట్లు స్వచ్చమైన బంగారాన్ని కాయిన్లు, బార్ల రూపంలో కొనుగోలు చేస్తారు.
బంగారు ఆభరణాలను అచ్చమైన బంగారంతో తయారు చేయడం సాధ్యం కాదు.అందువల్ల ఇతర లోహాలను బంగారంలో కలిపి ఆభరణాలను తయారు చేస్తారు. ఈ లోహాలు ఎంత వరకు కలిపారన్న దానిపై ఆ నగ స్వచ్చత ఆధారపడి ఉంటుంది. హాల్ మార్క్ గుర్తు బంగారు ఆభరణాల స్వచ్చత (22 క్యారెట్లు, 18 క్యారెట్లు, 14 క్యారెట్లు) ను తెలియజేస్తుంది. బంగారు ఆభరణాలను కొనుక్కునే వినియోగదారుడు మోసపోకుండా భారత ప్రభుత్వం బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) ను ఏర్పాటు చేసింది. ఒకవేళ బంగారు స్వచ్చత విషయంలో అనుమానం వస్తే బీఐఎస్ కేర్ యాప్ ద్వారా మీరే స్వయంగా తనిఖీలు చేయవచ్చు.