Saturday Shani Pooja: ఈ రంగు రత్నం ఉంగరంలో ధరిస్తే, శని మీ జోలికి రమ్మన్నా రాదు, ఏ రత్నమో వెంటనే తెలుసుకోండి..

నీలం రత్నాన్ని శనికి చెందిన రత్నంగా పిలుస్తుంటారు. అయితే నీలం రత్నం చాలా ఖరీదు. కుండలిలో శనికి బలాన్నిచ్చేందుకు నీలం రత్నాన్ని ధరిస్తుంటారు.

Pic Source: Wikipedia

నవ గ్రహాలలో శనిదేవుడు ప్రధానంగా కనిపిస్తాడు. శనిభగవానుడు యమధర్మరాజుకు సోదరుడు. అందుకే యముడు మరణానంతరం దండనలు విధిస్తే, శనిదేవుడు జీవులు బ్రతికి ఉండగానే హింసించి యాతనలకు గురిచేసి శిక్షిస్తాడు. అందుకే శని దేవుడి పేరు చెప్పగానే అందరూ ఉలిక్కిపడతారు. జాతకంలో శనిదేవుడి ప్రభావం ఉండకూడదని ఆకాంక్షిస్తారు.

శనిని న్యాయదేవతగా కూడా పిలుస్తారు. శనిదేవుడు న్యాయప్రియుడు, తప్పు చేసేవారిని మాత్రమే దండిస్తాడు. శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. శనిదేవుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయని జోతిష్య నిపుణులు చెప్తున్నారు. శని దేవుడి సానుకూలం ప్రభావం పెంచేందుకు నీలం రత్నం ధరిస్తే మంచిదని సూచిస్తున్నారు.

 

Agnipath Scheme Row: అసలేం జరిగింది..సికింద్రాబాద్‌లో అగ్గి రాజేసిందెవరు, అదుపు తప్పిన యువకులతో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం, క్షణాల్లో రైల్వే స్టేషన్ అంతటా దట్టమైన మంటలు 

ఎందుకంటే శనిగ్రహం కిరణాలు నీలం రంగులో ఉంటాయి. నీలం రత్నాన్ని శనికి చెందిన రత్నంగా పిలుస్తుంటారు. అయితే నీలం రత్నం చాలా ఖరీదు. కుండలిలో శనికి బలాన్నిచ్చేందుకు నీలం రత్నాన్ని ధరిస్తుంటారు. నీలం రత్నం ధరించేవాళ్లు అది సెట్ అయితే ఆకాశమంత ఎత్తు ఎదుగుతారు లేదా పాతాళంలో కూరుకుపోతారనే నానుడి ఉంది.

అందుకే ఈ రత్నం ధరించేవాళ్లు సామాజిక సేవలో కూడా పాల్గొనాలి. నీలం రత్నం ధరించేటప్పుడు చాలా విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ రత్నం ధరించే వారు శనివార నియమాల్ని పాటించడం వల్ల కూడా శనీశ్వరుడు అనుగ్రహిస్తాడు.