Agnipath Scheme Row: అసలేం జరిగింది..సికింద్రాబాద్‌లో అగ్గి రాజేసిందెవరు, అదుపు తప్పిన యువకులతో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం, క్షణాల్లో రైల్వే స్టేషన్ అంతటా దట్టమైన మంటలు
Agnipath protests (Photo-ANI)

Hyd, June 17: త్రివిధ దళాల్లో సైనిక నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'అగ్నిపథ్' పథకంపై (Agnipath Scheme Row) దేశంలో పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నాలుగేళ్ల సర్వీస్ అంటూ కేంద్ర ప్రభుత్వం తమ జీవితాలను నాశనం చేస్తోందని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆందోళన కార్యక్రమాలు హింసాత్మక రూపు దాలుస్తున్నాయి. పలు చోట్లు ఆందోళనకారులు రైళ్లకు నిప్పు పెట్టారు. ఈ సెగ హైదరాబాదుకు కూడా పాకింది.

అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో (Secunderabad railway station) కొందరు యువకులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో రైలు పట్టాలపై పార్సిల్ సామాన్లు వేసి నిప్పుపెట్టారు. సికింద్రాబాద్ నుంచి బయల్దేరే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ రైలుకు నిప్పు పెట్టారు. ఈ ఘటనతో సికింద్రాబాద్ స్టేషన్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. బస్సులపై ఆర్మీ అభ్యర్థులు రాళ్లు రువ్వారు. రెండు బోగీలకు నిప్పంటించారు.

సికింద్రాబాద్‌లో రైళ్లకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు, అగ్నిపథ్‌ ఆందోళనతో రణరంగంగా మారిన సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌, వందల కోట్ల రూపాయల ఆస్తి నష్టం

మొదటి మూడు ఫ్లాట్‌ఫాంలలో పరిస్థితి ఉద్రిక్తంగా ( Agnipath Scheme Protest) మారింది. ఈ మూడు ఫ్లాట్‌ఫాంలను పూర్తిగా ధ్వంసం చేశారు. హౌరా ఎక్స్‌ప్రెస్‌, ఈస్ట్‌ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ సహా మూడు రైళ్లకు ఆందోళనకారులు నిప్పంటించారు. మొత్తానికి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ రణరంగంగా మారింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

అసలేం జరిగింది ?

ఆర్మీలో స్వల్పకాలిక ‍సర్వీసుల పేరుతో వచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉదయం సికింద్రాబాద్‌ స్టేషన్‌ దగ్గర ఆందోళన చేపట్టేందుకు ఎన్‌ఎస్‌యూఐ కు చెందిన విద్యార్థులు, కార్యకర్తలు చేరుకున్నారు. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ స్టేషన్‌ ఆవరణలో నినాదాలు చేశారు. ఆ తర్వాత ఒకటో నంబరు ప్లాట్‌ఫారమ్‌పైకి చేరుకున్ని బయలుదేరేందుకు సిద్దంగా ఉన్న రైలు ఇంజను ఎదుట బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేశారు. నిరసన కార్యక్రమం అంతా సవ్యంగా సాగిపోతుందనునే దశలో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది.

వైరల్ అవుతున్న విధ్వంసం వీడియోలు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో హై‌అలర్ట్, అగ్నిపథ్‌ స్కీం నిరసిస్తూ పలు రైళ్లకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు

అప్పటి వరకు ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న యువకుల్లో కొందరు అదుపు తప్పి రైల్వే ఆస్తులపై దాడులకు తెగబడ్డారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఇది ఉదయం 9 గంటల సమయంలో మొదలైంది. యువకుల ఆందోళను అదుపు చేసేంత రైల్వే బలగాలు అందుబాటులో లేకపోవడంతో ఒక్కసారిగా అదుపు తప్పిన ఆందోళన రైల్వే స్టేషన్ అంతటా బీభత్సంగా మారిపోయింది. నిమిషాల వ్యవధిలోనే ఒకటో నంబరు నుంచి మూడో నంబరు ఫ్లాట్‌ఫారమ్‌ వరకు రణరంగంగా మారింది.

పార్సిల్‌ కార్యాలయంలోకి చొరబడిన యువకులు అక్కడ చేతికి అందిన వస్తువునుల బయటకు తీసుకువచ్చారు. రైల్వ పట్టాలపై వేసి తగుల బెట్టారు. ఇందులో ద్విచక్ర వాహనాలతో త్వరగా మండిపోయే స్వభావం ఉన్న వస్తువులు ఉండటంతో క్షణాల్లో స్టేషన్‌ ఆవరణలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో రైళ్లలో ఉన్న ప్రయాణిణులు గందరగోళానికి గురయ్యారు. ప్రయాణం స్టేషన్‌కు వచ్చిన వారు ప్రాణభయంతో పరుగులు తీశారు.

మంటల్లో చిక్కుకున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌, అగ్నిపథ్‌ ఆందోళనతో అట్టుడికిన హైదరాబాద్, రైల్వే స్టేషన్‌ ప్రాంగణం, ప్లాట్‌ఫారమ్స్‌ల దగ్గర యుద్ధవాతావరణం

స్టేషన్‌లో దట్టమైన పొగలు అలుముకోవడం, మంటలు వ్యాపించడంతో ఆందోళనకారులు మరింతగా రెచ్చిపోయారు. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఈస్టుకోస్టు ఎక్స్‌ప్రెస్‌కి, హౌరా ఎక్స్ ప్రెస్‌ కి నిప్పు పెట్టారు. ముఖ్యంగా ఆ రైలులో పార్సిల్‌ కౌంటర్‌ తెరిచే ఉంటంతో మంటలు త్వరగా వ్యాపించాయి. క్షణాల్లోనే ఇతర బోగీలకు చేరుకున్నాయి. దీంతో సికింద్రాబాద్‌ స్టేషన్‌ అంతా నల్లని దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఒక్కసారిగా చెలరేగిన ఆందోళనతో ఇటు రైల్వే అధికారులు, అటు రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు.

సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వచ్చే రైళ్లను ఎక్కడిక్కడే నిలిపేశారు. స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు ఇతరులను బయటకు పంపించారు. రాష్ట్ర పోలీసులు బలగాలను అక్కడికి రప్పించారు. అయితే అప్పటికే స్టేషన్‌లో భీతావహా వాతావరణ పరిస్థితి నెలకొంది. లాఠీఛార్జ్‌ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చే పరిస్థితులు కూడా కనిపించకపోవడంతో ఆందోళన కారులకు పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే భారీ ఎత్తున నష్టం వాటిల్లింది.

ఒకటి నుంచి మూడో నంబరు వరకు ఫ్లాట్‌ఫారమ్స్‌పై భారీగా ఆస్తి నష్టం జరిగింది. స్టేషన్‌పై ఉన్న కేఫ్‌టేరియాలో కూడా ధ్వంసం అయ్యాయి. లైట్లు, సీసీ కెమెరాలు, చెత్త కుండీలు ఇలా ప్లాట్‌ఫారమ్‌పై కనిపించిన వస్తువులు ధ్వంసం అయ్యాయి. ఆందోళనలకు బయపడిన ప్రయాణికులు కొందరు తమ వస్తువులను స్టేషన్‌ ఆవరణలోనే వదిలేసి బయటకు పరుగులు తీశారు. మరికొందరు తమ వాళ్లు తప్పిపోయారంటూ ఆందోళన చెందారు. చివరకు ఉదయం 10:30 గంటల సమయంలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. పదిన్నర తర్వాత పోలీసుల బలగాలు భారీగా చేరుకున్నాయి. దీంతో పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించారు. మరోవైపు స్టేషన్‌కు చేరుకున్న ఫైర్‌ ఫైటర్లు మంటలను అదుపు చేసే పనిలో ఉన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఆందోళనలో ఎవరైనా మరణించారా అన్నది తేలాల్సి ఉంది.

అగ్నిపథ్‌‌కు వ్యతిరేకంగా బీహార్‌లో మిన్నంటిన నిరసనలు, ఆందోళనకారులను అదుపుచేయడానికి టియర్‌ గ్యాస్‌ ప్రయోగించిన పోలీసులు

అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసకాండతో ఎన్‌ఎస్‌యూఐ (NSUI)కి ఎలాంటి సంబంధం లేదని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షులు బలమూర్ వెంకట్ (Balamoor Venkat) స్పష్టం చేశారు. ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులు రైలుకు నిప్పు పెట్టినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు. అది అగ్నిపత్ వ్యతిరేక యువకుల పనిగా తెలుస్తోందని అన్నారు. ఆర్మీ పరీక్ష రద్దు చేసిన కారణంగా 44 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. బాధ, ఆవేదనతో పరీక్షకు అప్లై చేసిన విద్యార్థులు ఆ పని చేశారన్నారు. దీన్ని ఎన్‌ఎస్‌యూఐకి ఆపాదించడం సరికాదన్నారు. ‘‘నన్ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి షాయినాజ్ గంజ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు’’ అని బలమూర్ వెంకట్ తెలియజేశారు.