Secunderabad Bonalu: జులై 9వ తేదీన సికింద్రాబాద్ ఆషాడ బోనాల ఉత్సవాలు, 10 వ తేదీన రంగం నిర్వహిస్తున్నామని తెలిపిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

సికింద్రాబాద్ ఆషాడ బోనాల(Secunderabad Bonalu) ఉత్సవాలు జులై 9వ తేదీన నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) తెలిపారు.

Minister Talasani (Photo-Video Grab)

సికింద్రాబాద్ ఆషాడ బోనాల(Secunderabad Bonalu) ఉత్సవాలు జులై 9వ తేదీన నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) తెలిపారు.తెలంగాణ సంస్కృతికి (Telangana Culture)ప్రతీకగా నిలిచే బోనాల(Bonalu) ఉత్సవాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(CM KCR) ఆదేశాల మేరకు ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని చెప్పారు.

రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫ‌లితాలు విడుద‌ల‌, విద్యార్థులు తమ ఫలితాలను tsbie.cgg.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

ప్రతి సంవత్సరం గోల్కొండ లో బోనాల(Golkonda Bonalu) ఉత్సవాలు ప్రారంభమై తర్వాత సికింద్రాబాద్ బోనాలు, ఓల్డ్ సిటీ బోనాలు(Old City Bonalu) నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు.ఈ సంవత్సరం సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలు జులై 9 వ తేదీన, 10 వ తేదీన రంగం (భవిష్యవాణి) నిర్వహిస్తున్నామని వివరించారు. సోమవారం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి ఆలయ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం బోనాల ఉత్సవాల తేదీలు ప్రకటించారు.