Shab-e-Meraj History: రోజుకు 5 సార్లు నమాజ్ చెయ్యాలని అల్లాహ్ ఆదేశించిన రోజు, లైలతుల్-మేరాజ్ లేదా షబ్-ఎ-మేరాజ్ ఎందుకు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు
621 (1 హిజ్రీ పూర్వం) మహమ్మదు ప్రవక్త గారి షబ్-ఎ-మేరాజ్ న ఆరోహణాకార్యక్రమాల రెండు భాగాలు. మహమ్మదు ప్రవక్త భౌతికంగా మేరాజ్ ప్రయాణం చేశారని చాలామంది ముస్లిం పండితుల అభిప్రాయం.
ఇస్లామీయ సాంప్రదాయాలలో ఇస్రా, మేరాజ్ అనునవి సా.శ. 621 (1 హిజ్రీ పూర్వం) మహమ్మదు ప్రవక్త గారి షబ్-ఎ-మేరాజ్ న ఆరోహణాకార్యక్రమాల రెండు భాగాలు. మహమ్మదు ప్రవక్త భౌతికంగా మేరాజ్ ప్రయాణం చేశారని చాలామంది ముస్లిం పండితుల అభిప్రాయం. కొందరైతే ఆత్మపరంగా మేరాజ్ ప్రయాణం చేశారని భావిస్తారు. క్లుప్తంగా ఈ ప్రయాణ సారాంశాన్ని ఖురాన్ లోని అల్-ఇస్రా సూరాలో 1 నుండి 60 సూక్తులలో వర్ణింపబడింది. ఇతరత్రా విషయాలు హదీసులలో నుండి లభించాయి.ఈ సారి భారత్ లో ఫిబ్రవరి 19న షబ్-ఎ-మేరాజ్ ముబారక్ జరుపుకుంటున్నారు.
ఇస్రా: మక్కా నగరంలోని కాబాలో మహమ్మదు ప్రవక్త విశ్రాంతి తీసుకొనుచుండగా జిబ్రయీల్ దూత ప్రత్యక్షమై, అల్లాహ్ ఆజ్ఞతో బుర్రాఖ్ పై కూర్చుబెట్టుకొని, మక్కానుండి "సుదూరపు మస్జిద్" (జెరూసలేం లోని మస్జిద్-అల్-అఖ్సా) కు తీసుకెళ్ళాడు. ఈ ప్రయాణాన్ని ఇస్రా అంటారు. ఇచ్చట ప్రవక్తల నమాజుకు ఇమామత్ చేశారు. మేరాజ్ జరిగిన సమయంలో, ఆ ప్రాంతంలో మస్జిద్ లేదు. అందుకే ఆ మస్జిద్ కు 'సుదూరపు మస్జిద్' లేక మస్జిద్-ఎ-అఖ్సా అని పేరు పెట్టారు. ఈ మస్జిద్ జెరూసలేం లోని మస్జిద్ ల సమూహంలో గలదు
మహాశివరాత్రి రోజు శివలింగంపై ఈ 9 వస్తువులను వేసి పూజిస్తే, కోటీశ్వరులు అవడం ఖాయం..
మేరాజ్: "సుదూరపు మస్జిద్" నుండి జిబ్రయీల్, మహమ్మదు ప్రవక్తను బుర్రాఖ్ పై కూర్చోబెట్టి, మేరాజ్ స్వర్గారోహణకై తీసుకెళ్ళాడు. ఈ ప్రయాణాన్ని మేరాజ్ అంటారు.ఈ ఆరోహణలో మహమ్మదు ప్రవక్త ఇతర ప్రవక్తలతో సంభాషిస్తాడు. అల్లాహ్ తోనూ సంభాషిస్తాడు. ఈ శుభఘడియలో అల్లాహ్ తన బహుమానంగా మహమ్మదు ప్రవక్తకు 5 పూటల ప్రార్థనలను (నమాజ్ లను) ప్రసాదిస్తాడు.
ఈ మహమ్మదు ప్రవక్త 'ఇస్రా, మేరాజ్' ఆరోహణనూ (The Night of Ascent), ప్రయాణాన్ని విశ్వాసులు నమ్ముతారు (అందులో అబూబక్ర్ ప్రథముడు), అవిశ్వాసులు నమ్మక గేలిచేస్తారు.మహమ్మదు ప్రవక్త 'ఇస్రా మేరాజ్' లను పునస్కరించుకొని ముస్లింలు షబ్-ఎ-మేరాజ్ లేదా లైలతుల్ మేరాజ్ పర్వాన్ని గడుపుకొంటారు. రాత్రంతా జాగారం చేసి నమాజ్ చేస్తారు.ఇస్లాంలో పర్వదినమైన లైలతుల్-మేరాజ్, హిజ్రత్కు ముందు తాయిఫ్ ప్రజలవద్దకు వెళ్ళకముందు జరిగింది. రజబ్ నెల 27వ తేదీన రాత్రి జరిగింది.
లైలతుల్-మేరాజ్ లేదా షబ్-ఎ-మేరాజ్ (Shab-e-Miraj) ప్రపంచంలోని అన్ని దేశాలలోని ముస్లింలు ఘనంగా జరుపుకుంటారు. ఈ పర్వాన మస్జిద్ లకు దీపాలతో అలంకరిస్తారు. రాత్రంతా జాగారం జేస్తూ ప్రార్థనలు చేస్తారు. ఇస్రా, మేరాజ్ ల కథ వివరింపబడుతుంది. మహమ్మదు ప్రవక్త ఏ విధంగా అల్లాహ్ను కలవడానికి జిబ్రయీల్తో బుర్రాఖ్ పై ప్రయాణ మయ్యారు, వారి ప్రయాణం యేవిధంగా జరిగింది, అల్లాహ్, మహమ్మద్ ల మధ్య సంభాషణ, వాటి విషయాలు యేవి ఇవన్నియూ ప్రసంగరూపంలో సాగుతాయి. ఈ రాత్రిప్రయాణం జరిగి అల్లాహ్ తో సంభాషించిన తరువాత అల్లాహ్, మహమ్మదు ప్రవక్త ఆయన అనుచరులంతా రోజుకు అయిదు సార్లు నమాజ్ చెయ్యాలని ఆదేశిస్తాడు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో ముస్లీం పెద్దలు రాసిన సమాచారం ఆధారంగా ఇవ్వడం జరిగింది. ఏదైనా పొరపాటు ఉంటే లేటెస్ట్‌లీ దానికి ఎలాంటి బాధ్యత వహించదు.