Surya Grahan: నేడే సూర్యగ్రహణం, ఈ రాశుల వారు ప్రయాణాలు చేయకండి, మీ రాశి ఇందులో ఉందో లేదో చెక్ చేసుకోండి..
మరుసటి రోజు అంటే మే 1 ఉదయం 04:07 గంటలకు ముగుస్తుంది.
ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. కొన్ని ఇతర దేశాల్లో కనిపించనుంది. దీంతో భారత కాలమాన ప్రకారం ఏప్రిల్ 30 మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే మే 1 ఉదయం 04:07 గంటలకు ముగుస్తుంది. ఈ సూర్యగ్రహణం అంటార్కిటికా, అట్లాంటిక్, దక్షిణ అమెరికాలోని నైరుతి భాగం, పసిఫిక్ మహాసముద్రంలో కనిపిస్తుంది. ఈ గ్రహణం ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది, అయితే మేషం, కర్కాటకం , వృశ్చికం రాశుల వారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
మేషరాశి: మేషరాశిలో ఈ సూర్యగ్రహణం ఏర్పడనుంది. కాబట్టి దీని ప్రభావం మేషరాశి వారిపై ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమయంలో మీ శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయిస్తారు. ఈ సందర్భంలో, మీరు జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే నష్టపోవచ్చు. ఈ రాశి వారు ఏ పనిలోనైనా తొందరపడకూడదు. సూర్యగ్రహణం సమయంలో ప్రయాణం చేయడం అశుభం.
కర్కాటక రాశి: ఈ రాశికి అధిపతి చంద్రుడు. ఈ సమయంలో, చంద్రుడు రాహువుతో కలిసి మేషరాశిలో ఉంటాడు. ఈ రాశి వారు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది. భయం , ప్రతికూలత అధికంగా ఉంటుంది. అంతేకాదు అధికంగా ఖర్చులు చేయాల్సి రావచ్చు. ఈ రాశి ప్రజలు సహనంతో ఉండటం అవసరం.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు గౌరవాన్ని కోల్పోవలసి రావచ్చు. కనుక ఈ సమయంలో, ఏదైనా పని చేసే ముందు ఆలోచించాల్సి ఉంటుంది. శత్రువులు హాని కలిగించవచ్చు. ఇతరులతో వాదనలు మానుకోండి.