Chandra Grahanam 2023: సంవత్సరంలో మొదటి చంద్ర గ్రహణం మే5 న ఏర్పడుతోంది, ఈ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి

వచ్చే నెల మే 5న చంద్రగ్రహణం ఏర్పడింది ఈ సంవత్సరంలోనే తొలి చంద్రగ్రహణం ఈ నెలలో ఏర్పడనుంది ఈ నేపథ్యంలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఐదు రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

Moon (Photo Credits: Pixabay)

వచ్చే నెల మే 5న చంద్రగ్రహణం ఏర్పడింది ఈ సంవత్సరంలోనే తొలి చంద్రగ్రహణం ఈ నెలలో ఏర్పడనుంది ఈ నేపథ్యంలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఐదు రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీరు ప్రమాదంలో ఇరుక్కునే అవకాశం ఉంది.  ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారు చంద్రగ్రహణం ఎట్టి పరిస్థితుల్లోనూ చూడవద్దు చూస్తే మాత్రం చాలా ప్రమాదంలో ఎత్తుకునే అవకాశం ఉంది ఆయా రాశులు ఏంటో ముందే తెలుసుకొని జాగ్రత్త పడండి. 

మేషం:  మేష రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రగ్రహణం చూడకూడదు.  అలాగే చంద్రగ్రహణం ప్రారంభం నుంచి 15 రోజులపాటు వీరికి ఆస్థితిలో మార్పుల కారణంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.  ముఖ్యంగా ధన నష్టం జరిగే అవకాశం ఉంది.  కావున అపరిచితులకు అప్పు ఇవ్వవద్దు.  అదేవిధంగా రిస్కీ పెట్టుబడులకు దూరంగా ఉండాలి.  గ్రహణం రోజున ఓం నమశ్శివాయ మంత్రం చదవాలి. అదే విధంగా చీమలకు పంచదార వేయాలి. 

కర్కాటకం:  కర్కాటక రాశి వారు చంద్రగ్రహణం వల్ల చాలా చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది.  అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కుటుంబంలో కలహాలు వచ్చే ప్రమాదం ఉంది.  ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇతరులతో వివాదాలకు వాదనకు దిగవద్దు.  చాలా ప్రమాదంలో చుట్టుకునే అవకాశం ఉంటుంది.  గ్రహణం అనంతరం ఆంజనేయ స్వామి గుడిలో ఆవు నెయ్యితో దీపం వెలిగించండి.  

తుల:  తులా రాశి వారు చంద్రగ్రహణం రోజు దూర ప్రయాణాలు చేయవద్దు.  అంతే కాదు చంద్రగ్రహణం తర్వాత 15 రోజుల పాటు రోడ్డు ప్రయాణించే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  వేగంగా డ్రైవింగ్ చేయడం.  సీటు బెల్టు హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేయడం వంటివి చేయకూడదు.  అలాగే తప్పనిసరి అయితే తప్ప దూర ప్రయాణాలను మానుకోండి.  గ్రహణం అనంతరం శివాలయం వెళ్లి పాలతో అభిషేకం చేయండి.  

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి, ఎన్ని ద్వారాలు

మకరం: మకర రాశి వారు చంద్రగ్రహణం రోజు నీటిలో ప్రయాణం చేయకూడదు. చంద్రగ్రహణం అనంతరం 15 రోజులపాటు చాలా జాగ్రత్తగా ఉండాలి దగ్గర వారే మోసం చేసే ప్రమాదం ఉంది కావున ఎవరిని అంత సులభంగా నమ్మకండి.  ముఖ్యంగా ఉద్యోగం చేసే ప్రదేశంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఏమాత్రం నిర్లక్ష్యం తగదు.  గ్రహణం అనంతరం అమ్మవారి గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టండి.  

కుంభం:  ఈ రాశి వారు చంద్రగ్రహణం రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా విదేశాలకు వెళ్లడం వంటి ప్రయాణాలను మానుకోండి. భార్యాభర్తల మధ్య అనుమానాలు తలెత్తే అవకాశం ఉంది కావున చాలా జాగ్రత్తగా ఉండండి.  అదేవిధంగా కుంభ రాశి వారు గ్రహణం సమయంలో హనుమాన్ చాలీసా చదివితే చాలా మంచిది.    



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif