Santhana Gopala Mantram: కొడుకు పుట్టాలంటే సంతానం కోరుకునే మహిళలు చదవ వలసిన సంతాన గోపాల మంత్రం ఇదే..

ముఖ్యంగా ఈ మంత్రం గర్భం దాల్చబోయే మహిళ భక్తిశ్రద్ధలతో చదవడం ద్వారా మీకు సంతానం కలిగే భాగ్యం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.

Pregnant (File: Istock)

చాలామంది దంపతులు సంతానం కోసం చేయని పూజలు, నోచని నోములు ఉండవు. దాంపత్యానికి సంతానమే, అసలైన నిర్వచనం అందం, ఆనందం, అందిస్తుంది. ముఖ్యంగా చాలామంది దంపతులు తమకు సంతానం కలగాలని డాక్టర్ల వద్దకు అదేవిధంగా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. దాంతో పాటు దైవ శక్తిని కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు. మానవ ప్రయత్నంతో పాటు దైవం కూడా కరుణిస్తేనే సంతానం కలుగుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ నేపథ్యంలో మీరు కూడా సంతానం గురించి ఆలోచిస్తున్నట్లయితే కింద పేర్కొన్నటువంటి మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో పాటిస్తే మంచిది. ముఖ్యంగా ఈ మంత్రం గర్భం దాల్చబోయే మహిళ భక్తిశ్రద్ధలతో చదవడం ద్వారా మీకు సంతానం కలిగే భాగ్యం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.

సంతానం కోరుకునే మహిళలు చదవాల్సిన సంతాన గోపాల మంత్రం ఇదే..

దేవకీసుతం గోవింద వాసుదేవ

జగత్పతే దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

దేవ దేవ జగన్నాధ గోత్ర వృద్ధి కరప్రభో

దేహి మే తనయం శీఘ్రం ఆయుష్మంతం యశస్వినం!

ఎవరు చదవాలి..

>> ఆలస్యంగా గర్భం దాల్చిన వారు

>> సంతాన దోషాలు ఉన్న వారు

>> గర్భస్రావ భయం ఉన్న వారు చదువుకోండి

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి,

ఎలా చదవాలి..

రోజు నిద్ర లేచి ఉదయం పూట ఈ మంత్రం 3 సార్లు చదవాలి. మొదటి సారి ఏదైనా బుధవారం ప్రారంభించండి. ఇలా 3 నెలల పాటు ఆపకుండా చేయండి. చిన్ని కృష్ణుడి చిత్రపటం ముందు అటుకులు - పంచదార నైవేద్యం పెట్టి, ప్రారంభించండి. అప్పుడు మీకు కచ్చితంగా ఫలితం లభిస్తుంది.



సంబంధిత వార్తలు