Ugadi Panchangam: శుభకృత నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారు రియల్ ఎస్టేట్‌, షేర్ మార్కెట్లో బాగా సంపాదిస్తారట.. మీరు కూడా ఆ రాశిలో ఉన్నారా చెక్ చేసుకోండి

రాశిచక్రం ప్రకారం ఈ 4 నాలుగు రాశుల వారు కానీ పెట్టుబడుల విషయంలో వీరు ముందుంటారు.

file

ఈ ఉగాది పర్వదినాన ప్లవ నామ సంవత్సరం పూర్తి చేసుకొని శ్రీ శుభకృత నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. 1962 - 1963 లో వచ్చిన శుభకృత్ మళ్లీ 2022 - 2023లో వస్తోంది. అయితే ఈ ఏడాది ఏయే రాశుల పెట్టుబడులు కలిసి వస్తాయో తెలుసుకుందాం.

డబ్బు సంపాదించడమే కాదు దాన్ని పొదుపు చేయడం కూడా తెలిసి ఉండాలి. కొంతమంది వ్యక్తులు బాగా డబ్బు సంపాదిస్తారు.. కానీ విచ్చలవిడి ఖర్చులతో అవసరానికి చేతిలో డబ్బు లేకుండా చేసుకుంటారు. మరికొందరు అవసరానికి మాత్రమే డబ్బు ఖర్చు చేస్తారు. అవసరం లేనిదే ఒక్క పైసా జేబు నుంచి బయటకు తీయరు. అదే ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తారు. రాశిచక్రం ప్రకారం ఈ 4 నాలుగు రాశుల వారు కానీ పెట్టుబడుల విషయంలో వీరు ముందుంటారు.

మేష రాశి :

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశి వారు చాలా తెలివిగా ఆలోచిస్తారు. వీలైనంత ఎక్కువ డబ్బును కూడబెడుతారు. పెట్టుబడుల ద్వారా ఆదాయాన్ని పొందే మార్గాలను అన్వేషిస్తారు. పెట్టబడులు ఆర్థిక వృద్దికి దోహదపడుతాయని నమ్ముతారు. వీరు సాధారణ జీవితాన్నే గడుపుతారు. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు వీరికి బాగా కలిసి వస్తాయి.

కర్కాటక రాశి :

కర్కాటక రాశి వారు డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో అత్యంత జాగ్రత్తగా ఉంటారు. పైసా ఖర్చు పెట్టేముందు వెయ్యి సార్లు ఆలోచిస్తారు. వృథా ఖర్చుల జోలికి వెళ్లరు. ముఖ్యమైన పనులకు మాత్రమే తమ జేబుల్లో నుంచి డబ్బు తీస్తారు. ఈ ఏడాది వీరి బ్యాంక్ బాలెన్స్ పెరుగుతుంది.

కన్య రాశి:

కన్య రాశి వారు డబ్బు ఆదా చేయడంలో ముందుంటారు. డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరమొచ్చినా సరే.. తెలివిగా ఆ పరిస్థితిని దాటవేస్తారు. ఆర్థిక క్రమశిక్షణతో మెలుగుతారు. అవసరం లేని పనులకు డబ్బును వెచ్చించరు. పెట్టుబడులు పెట్టడంలో ముందుంటారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు వీరికి బాగా కలిసి వస్తాయి...

మకర రాశి:

మకర రాశి వారు చాలా కష్టజీవులు. కష్టపడి పైసా పైసా కూడబెట్టి డబ్బు సంపాదిస్తారు. సరైన సందర్భంలో దాన్ని పెట్టుబడిగా పెడుతారు. పెట్టుబడుల విషయంలో వీరికి మంచి పట్టు ఉంటుంది. పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయంతో బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటారు. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ వీరికి బాగా కలిసి వస్తాయి.