Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి, ఎన్ని ద్వారాలు ఉంటే శుభం, ఎన్ని ద్వారాలు ఉంటే అశుభం, వాస్తు రీత్యా తెలుసుకోండి...

అద్దె ఇల్లయినా, సొంత ఇల్లయినా శుభ సంఖ్యలో ద్వారాలు ఉండాలని వాస్తు శాస్త్రం తెలియజేస్తోంది.

(Photo Credit: social media)

Vastu Shastra Tips for Doors:  వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ద్వారాల సంఖ్యను బట్టి, ఇంట్లో నివసించే కుటుంబ సభ్యుల ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పవచ్చు. అద్దె ఇల్లయినా, సొంత ఇల్లయినా శుభ సంఖ్యలో ద్వారాలు ఉండాలని వాస్తు శాస్త్రం తెలియజేస్తోంది. శుభ సంఖ్యలో ద్వారాలు ఉంటే ఇంట్లో నివసించే వారికి మంచి ఫలితాలను ఇస్తాయి.

శుభాన్ని కలిగించే ద్వారాల సంఖ్య

ఇంటిలో రెండు ద్వారాలు ఉంటే చాలా శ్రేష్టము. రెండు ద్వారాలు గల ఇంటిలో నివసించే వ్యక్తులు శ్రేష్టమైన జీవన అభివృద్ధి కలుగుతుంది. అదే నాలుగు ద్వారాలు ఉన్న గృహంలో నివసించే వ్యక్తులకు ఆయువు, ఆరోగ్యాలను కలిగి వారి కృషికి తగిన ఫలితం లభిస్తుంది. వీరికంటూ సమాజంలో ప్రత్యేక గౌరవం ఏర్పడి మంచి గుర్తింపు కలుగుతుంది. ఆరు ద్వారాలున్న ఇల్లు పుత్ర వృద్ధి, శ్రేయస్సు, ఐశ్వర్యము కలుగుతుంది.

అదే ఎనిమిది ద్వారాలు ఉన్న గృహంలో నివసించే వ్యక్తులకు సకల భోగభాగ్యాలు కలిగి అష్టైశ్వర్యాలతో తులతూగుతారు. పన్నెండు ద్వారాలు గల ఇల్లు ఉద్యోగ, వ్యాపారాలలో మంచి అభివృద్ధిని కలిగించి మంచి కీర్తి ప్రాప్తిస్తుంది. పద్నాలుగు ద్వారలు ఉన్న ఇల్లు కుటుంబ వృద్ధి, ధన సంపదని కలిగిస్తుంది. పదహారు ద్వారములు గల ఇల్లు అన్నింటిలో విజయం లభించింది లాభములను చేకూరుస్తుంది.

కీడును కలిగించే ద్వారాల సంఖ్య

మూడు ద్వారములు గల ఇల్లు శత్రువులను పెంచి అపనిందల పాలుచేస్తుంది. అధిక ఖర్చులను పెంచి ఆర్థిక నష్టాన్ని కలుగజేస్తుంది. ఐదు ద్వారాలు గల ఇల్లు అనారోగ్య సమస్యలను, సంతానానికి కీడును, శత్రువుల నుండి ఇబ్బందులను కలిగిస్తుంది. ఏడు ద్వారములు ఉన్న ఇల్లు అధిక కష్టాలను కలిగించి ఇబ్బందులకు గురిచేస్తుంది.

తొమ్మిది ద్వారములు ఉన్న ఇల్లు అశాంతిని కలిగించి ఇంటి యజమానికి తీరని నష్టాన్ని కలగజేస్తుంది. పది ద్వారాలు ఉన్న ఇల్లు దొంగల భయం ఉంటుంది. పదకోండు ద్వారాలు ఉన్న ఇల్లు భార్య వ్యభిచారం చేసేలా చేస్తుంది. పదమూడు ద్వారాలు ఉన్న ఇల్లు కష్టనష్టాలను కలిగించి ఇబ్బందులకు గురి చేస్తుంది. పదిహేను ద్వారములు ఉన్న ఇల్లు అశాంతికి, అధిక ఖర్చులకు దారితీస్తుంది. కనుక వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణంలో ద్వారాలు సరైన సంఖ్యలో ఉండాలి.