Masik Shivratri 2023 Dates List: పరమశివుడికి అత్యంత ఇష్టమైన ఈ తేదీల గురించి తెలుసా? కేవలం మహాశివరాత్రి ఒక్కటే కాదు, ప్రతీనెలా శివున్ని పూజించేందుకు ఉన్న ప్రత్యేక తేదీలివే!
అయితే ప్రతి నెలలో వచ్చే మాసశివరాత్రి (Masik Shivratri) రోజు కూడా శివున్ని పూజించేవారు...ప్రత్యేక పూజలు చేస్తారు. మహాశివరాత్రి ఏ విధంగా నిష్టతో ఉపవాసం ఉంటారో...అలాగే ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రికి కూడా పూజలు చేస్తారు.
Hyderabad, FEB 13: పరమశివుడి ఆరాధకులకు అత్యంత పవిత్రమైన రోజు మహా శివరాత్రి (Maha Shivratri). అయితే ప్రతి నెలలో వచ్చే మాసశివరాత్రి (Masik Shivratri) రోజు కూడా శివున్ని పూజించేవారు...ప్రత్యేక పూజలు చేస్తారు. మహాశివరాత్రి ఏ విధంగా నిష్టతో ఉపవాసం ఉంటారో...అలాగే ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రికి కూడా పూజలు చేస్తారు. 2023 సంవత్సరంలో మహాశివరాత్రి ఫిబ్రవరి 18న వస్తుంది. ఇక ప్రతి నెలలో అమావాస్యరోజున మాసశివరాత్రిని జరుపుకుంటారు. దీంతో ఈ ఏడాది వచ్చే మాసశివరాత్రి తేదీలు, సమయాల గురించి తెలుసుకుందాం...2023లో తొలి మాసశివరాత్రి జనవరి 20న వస్తుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 18న మహా శివరాత్రి వస్తుంది. ఈ రోజుల్లో శివయ్యను పూజించేవాళ్లు పాలాభిషేకంతో పాటూ, ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.
2023 ఏడాదిలో మాసశివరాత్రి, మహా శివరాత్రి తేదీలు ఇవే:
జనవరి 20, 2023 శుక్రవారం మాఘమాసిక శివరాత్రి
ఫిబ్రవరి 18. 2023 శనివారం మహాశివరాత్రి
మార్చి 20, 2023 సోమవారం చైత్ర మాసిక శివరాత్రి
ఏప్రిల్ 18, 2023 మంగళవారం వైశాఖ మాసిక శివరాత్రి
మే 18, 2023 బుధవారం జైష్ఠ్య మాసిక శివరాత్రి
జూన్ 16, 2023 శుక్రవారం ఆషాడ మాసిక శివరాత్రి
జులై 15, 2023 శనివారం సావన్ శివరాత్రి
ఆగస్టు 14, 2023 సోమవారం అధిక మాసిక శివరాత్రి
సెప్టెంబర్ 13, 2023 బుధవారం భాద్రపద మాసిక శివరాత్రి
అక్టోబర్ 12, 2023 గురువారం అశ్వినమాసిక శివరాత్రి
నవంబర్ 11, 2023 శనివారం కార్తీకమాసిక శివరాత్రి
డిసెంబర్ 11, 2023 సోమవారం మార్గశ్రిష్ట శివరాత్రి