Durga Ashtami 2022: దుర్గాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి, ఈ సంవత్సరం ఏ తేదీన జరపుకుంటారు, శుభ ముహూర్తం ఎప్పుడు, ఆయుధ పూజ ఎలా జరుపుకోవాలి..
ఈ రోజు అమ్మవారిని దుర్గాదేవి రూపంగా పూజిస్తారు. అలాగే ఈ రోజు ఆయుధపూజ ను కూడా నిర్వహిస్తారు.
Durga Ashtami 2022 : దసరా నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు అయినటు వంటి అష్టమినాడు, దుర్గాష్టమి నిర్వహిస్తారు. ఈ రోజు అమ్మవారిని దుర్గాదేవి రూపంగా పూజిస్తారు. అలాగే ఈ రోజు ఆయుధపూజ ను కూడా నిర్వహిస్తారు. ఆయుధ పూజలో భాగంగా ప్రజలు తమ వాహనాలకు పూలు ఇతర సామాగ్రి తో అలంకరించి పూజ చేస్తారు. అయితే ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం.
దసరా దేవీ నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు అంటే ఆశ్వయుజ అష్టమి నాడు దుర్గాష్టమి నిర్వహిస్తారు. ఈ రోజు వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడినవారు ఆయుధ పూజ చేస్తారు. తమ వృత్తికి సంబంధించిన సామగ్రిని, ముఖ్యమైన పరికరాలను అమ్మవారి ఎదుట ఉంచి పూజ చేస్తారు.
నవరాత్రుల మహాష్టమి వ్రతం అక్టోబర్ 3న నిర్వహిస్తారు. నవరాత్రుల అష్టమి తేదీ 2 అక్టోబర్ 2022 సాయంత్రం 06.47 నుండి ప్రారంభమవుతుంది, ఇది అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం 04:37 గంటలకు జరుగుతుంది.
అక్టోబరు 3వ తేదీన విజయవాడలో కనకదుర్గ తల్లి దుర్గాదేవి అలంకారంలో కన్పిస్తారు. ఈరోజు ఎరుపు రంగు చీరను అమ్మవారికి కడతారు. నైవేద్యంగా కదంబం, శాకాన్నం పెడతారు.
నవరాత్రులను పవిత్ర దినాలుగా భావించి ఈరోజుల్లో నియమనిష్ఠలతో ఉంటారు. దసరా నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు కు అత్యంత ప్రాశస్త్యం ఉంది ఈ రోజే అమ్మవారు దుర్గాదేవి అవతారం ఏంది దుష్ట సంహారం చేసినట్లు పురాణాల్లో ఉంది. ఈ సంవత్సరం దుర్గాష్టమి అక్టోబర్ 3వ తేదీన జరుపుకుంటున్నారు.
వ్యాపారులు తమ సంస్థలను పూవులతో అలంకరించుకుని దుర్గాదేవి పూజ చేసుకుంటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు దుర్గాష్టమి, విజయదశమి రోజుల్లో ఆరంభించడం శుభసూచకంగా భావిస్తారు.
ఈ రోజు అందరూ దుర్గాదేవిని అర్చిస్తారు. దుర్గాష్టమి రోజున ఉపవాసం ఉంటారు. ప్రత్యేకంగా అమ్మవారి ఆలయాలకు వెళ్ళి పూజలు చేసుకుంటారు.