Lower Risk Of Diabetes For Faster walkers: వేగంగా నడిస్తే తగ్గనున్న మధుమేహ ముప్పు.. హైబీపీ, గుండె సంబంధిత వ్యాధులూ తగ్గే అవకాశం.. తాజా అధ్యయనంలో వెల్లడి
వేగవంతమైన నడకతో డయాబెటిస్ (మధుమేహం)తో పాటు గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
Newdelhi, Dec 23: వేగవంతమైన నడకతో డయాబెటిస్ (మధుమేహం)తో (Diabetes) పాటు గుండె సంబంధ వ్యాధులు (Heart Issues) వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ మేరకు జపాన్ లోని దోషిషా యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. స్థూలకాయం లేదా నడుము చుట్టు కొలత అధికంగా ఉన్న దాదాపు 25,000 మందినిపై ఈ అధ్యయనం చేశారు. వేగంగా నడిచే వారిలో డయాబెటిస్ ముప్పు దాదాపు 30 శాతం తక్కువని ఈ అధ్యయనంలో వెల్లడైంది. హైపర్ టెన్షన్, డిస్లీపిడీమియా (రక్తంలో అసాధారణ లిపోప్రొటీన్ లెవల్స్) ముప్పు కూడా చాలా తక్కువని తేలింది.
అల్లు అర్జున్ నివాసంపై దాడి కేసులో ఆరుగురి అరెస్ట్.. రిమాండ్.. బెయిల్
అందుకే..
వేగంగా నడిచే వాకర్లలో గుండె, ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉన్నట్టు పరిశోధకులు తెలిపారు. ఈ వ్యవస్థ పనితీరు సరిగ్గా లేనట్టయితే జీవక్రియకు సంబంధించిన వ్యాధులు వచ్చే ముప్పు అధికంగా ఉంటుంది.
సన్నీ లియోన్ కు నెలకు రూ.1000.. అకౌంట్ లోకి ఛత్తీస్ గఢ్ ప్రభుత్వ నిధులు