Mental Disorder: తీవ్ర రూపం దాల్చిన డిప్రెషన్, ఇండియాలో ప్రతి ఏడు మందిలో ఒకరు మానసిక వ్యాధితో బాధపడుతున్నారన్న సర్వే, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ స్టడీలో నిగ్గు తేలిన నిజాలు
డిప్రెషన్‌తో(mental disorder) సతమతమవుతున్నవారు ఇండియాలో చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారని నివేదిక చెబుతోంది. 2017లో ప్రతి ఏడు మంది భారతీయుల్లో ఒకరు మానసిక రోగంతో ఇబ్బందిపడినట్లు ఓ సర్వే పేర్కొన్నది.
New Delhi,December 24: దేశంలో మానసిక వ్యాధులతో(mental health issues) బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరుగుతోంది. డిప్రెషన్‌తో(mental disorder) సతమతమవుతున్నవారు ఇండియాలో చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారని నివేదిక చెబుతోంది. 2017లో ప్రతి ఏడు మంది భారతీయుల్లో ఒకరు మానసిక రోగంతో ఇబ్బందిపడినట్లు ఓ సర్వే పేర్కొన్నది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ (Indian Council of Medical Research)చేపట్టిన స్టడీలో ఈ విషయాలు తెలిసాయి. ఈ రిపోర్టును ప్రముఖ జర్నల్ లాన్‌సెట్ సైకియాట్రీలో (Lancet paper) ప్రచురించారు.
ఇంకా విషాదకర అంశం ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల్లోనే ఈ ప్రభావం ఎక్కువగా ఉందని తేలింది. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు,(Tamil Nadu) కేరళ, (Kerala) తెలంగాణ,(Telangana) కర్నాటక,(Karnataka) గోవా, (Goa)ఏపీల్లో(AP) ఈ సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సర్వే ప్రకారం సుమారు 4.57 కోట్ల మంది సాధారణ మానసిక(డిప్రెషన్) సమస్యతో ఇబ్బందిపడుతున్నట్లు ఆ సర్వే తెలిపింది. మరో 4.49 కోట్ల మంది నిద్రలేమి(యాంగ్జైటీ-రెస్ట్‌లెస్‌నెస్)తో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే డిప్రెషన్ కేసులు ఎక్కువగా తమిళనాడు రాష్ట్రంలో ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత కేరళ, గోవా, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. సోషియా డెమోగ్రాఫిక్ ఇండెక్స్(ఎస్‌డీఐ) ఆధారంగా మానసిక వ్యాధుల అధ్యయనం జరిగింది. యాంగ్జైటీతో ఇబ్బందిపడుతున్న రాష్ట్రాల్లో కేరళ టాప్‌లో ఉన్నది.ఆ తర్వాత స్థానాల్లో హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలు ఉన్నాయి.
పురుషుల కన్నా ఎక్కువగా మహిళలే డిప్రెసన్‌కు లోనవుతున్నట్లు తేలింది. తీవ్ర మానసిక వత్తిడి వల్లే ఎక్కువ శాతం మంది ఆత్మాహత్యలకు పాల్పడుతున్నట్లు ఐసీఎంఆర్ డైరక్టర్‌జనరల్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ తెలిపారు. మానసిక వ్యాధిగ్రస్తుల్లో డిప్రెషన్ కేసులు 33.8 శాతం ఉన్నట్లు సర్వే చెప్పింది. నిద్రలేమి కేసులు 19 శాతం ఉన్నట్లు తేల్చారు. 1990 దశకం నుంచి 2017 వరకు మానసిక వ్యాధుల కేసులు రెండింతలైనట్లు ఆయన వెల్లడించారు.